|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు: రాంరాజు ఫైర్! సాగర్ తెగింపు!! షాకింగ్ టర్న్

Published: 15-04-2026, 1:35 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రాంరాజు ఫైర్! సాగర్ తెగింపు!! షాకింగ్ టర్న్
  • రామరాజు ఆగ్రహంతో సాగర్ తెచ్చిన బట్టలు తగలబెట్టడం సంచలనం!
  • అప్పుల బాధతో రామరాజును బెదిరించిన సేట్ – ఉత్కంఠ రేపుతున్న సీన్!
  • అమూల్య విషయంలో ప్రేమ తప్పు చేయలేదని తెలుసుకున్న ధీరజ్!
  • ఇంట్లోంచి వెళ్లిపోవాలని సాగర్ నిర్ణయం – నర్మద షాక్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రాంరాజు ప్రవర్తన సాగర్ జీవితాన్ని మార్చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ధీరజ్ పశ్చాత్తాపం: ప్రేమకు క్షమాపణ!

Illu Illalu Pillalu April 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో తప్పు తెలుసుకున్న ధీరజ్.. ప్రేమను క్షమించమని అడుగుతాడు. మరోవైపు కొత్త బట్టలతో ఇంటికి వచ్చిన సాగర్ పై రామరాజు ఫైర్ అవుతాడు. ఆ బట్టలను తగలబెడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సాగర్ నిర్ణయించుకుంటాడు.

Illu Illalu Pillalu April 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తమ్ముడు ధీరజ్ కు చందు నిజం చెప్పేస్తాడు. అమూల్య విషయంలో ప్రేమ ఎలాంటి తప్పు చేయలేదని ధీరజ్ తెలుసుకుంటాడు. మరోవైపు సాగర్ కు ఇచ్చిన అప్పు విషయంలో రామరాజును సేట్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో చూద్దాం.

కొత్త బట్టలతో వచ్చిన సాగర్ పై రాంరాజు ఫైర్

పాపపు సొమ్ముతో కొన్న వస్తువులు కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని అందరి చేతుల్లో నుంచి బట్టలు లాక్కొని రామరాజు తగలబెడతాడు. అది చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్, శ్రీవల్లి తెగ సంతోషపడతారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోదామని

ఇంట్లో నుంచి సాగర్ వెళ్లిపోతాడా?

నీ కోసం ఎక్కడికైనా వస్తా. కానీ జాబ్ మానేయమని నర్మద షాక్ ఇస్తుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నావా అని సాగర్ అడుగుతాడు. నర్మద వాళ్ల ఆయన డబ్బులతో జాబ్ కొనుక్కున్నాడని కొలీగ్స్ అంటుంటే చీప్ గా ఉందని నర్మద అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాగర్ తీసుకునే నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.