|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుకు మరణ శాసనం రాసిన సేనాపతి! ప్రేమకు లారీ ప్రమాదం! షాకింగ్ ట్విస్ట్!

Published: 08-04-2026, 1:35 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుకు మరణ శాసనం రాసిన సేనాపతి! ప్రేమకు లారీ ప్రమాదం! షాకింగ్ ట్విస్ట్!
  • వల్లి గురించి రామరాజు ప్రశ్నించడంతో చందు సీరియస్!
  • భాగ్యం డమ్మీ యాక్సిడెంట్ ప్లాన్ సేనాపతికి తెలుస్తుంది, చంపేయమని సుపారీ!
  • ప్రేమను లారీ ఢీకొట్టింది, సీరియల్‌లో షాకింగ్ ట్విస్ట్!
  • అమూల్య చేసిన కాఫీని చెత్తకాఫీ అని ధీరజ్ అంటాడు, ప్రేమకు అవమానం!

టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్! ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. చందు జీవితం ప్రమాదంలో పడింది. ప్రేమకు యాక్సిడెంట్ జరగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది.

చందును అంతమొందించాలని సేనాపతి ప్లాన్!

Illu Illalu Pillalu Serial April 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 8వ ఎపిసోడ్‌లో వల్లి గురించి రామరాజు అడిగితే చందు సీరియస్ అవుతాడు. చందుపై భాగ్యం డమ్మీ యాక్సిడెంట్ ప్లాన్ గురించి సేనాపతికి తెలుస్తుంది. కానీ, చందును నిజంగానే చంపేయామని సుపారీ ఇస్తాడు. ప్రేమను లారీ ఢీ కొడుతుంది.

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో అమూల్య కాఫీ చాలా బాగా పెట్టిందని మెచ్చుకుంటాడు ధీరజ్. అది ప్రేమ చేసిందని అమూల్య చెప్పడంతో ఇంత చెత్త కాఫీ ఎప్పుడు చూళ్లేదని ఊంచేస్తాడు ధీరజ్. కాఫీ బాగుందని అంతా అంటారు. సాగర్ వచ్చి తండ్రి మీద కోపంతో కాఫీ తాగకుండా వెళ్లిపోతాడు.

ఎందుకంటే.. అన్న చందు ప్రేమ సైగలతో ఆగిపోతాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని వెళ్లిందిగా. వస్తుందిలే నాన్న అని చందు వెళ్లిపోతాడు. ఏమైందిరా అని రామరాజు కంగారుపడుతుంటే ఏం లేదు నాన్న ఇంట్లో పనులన్నీ వల్లి వదిన ఒక్కతే చేయాలా. మిగిలినవాళ్లు లేరా అని అన్నయ్య కోపం అని ధీరజ్ కవర్ చేస్తాడు. ఇక నుంచి ఇంటి పనులన్నీ ప్రేమను చేయమని ఆర్డర్ వేస్తాడు ధీరజ్.

ప్రేమకు ప్రమాదం, సీరియల్‌లో ఊహించని ట్విస్ట్!

మరోవైపు సేనాపతి దగ్గర పనిచేసే డ్రైవర్ లోడ్ దించడానికి బదులు వేరే పని ఉందని, వెళ్తానంటాడు. ఏదో డమ్మీ యాక్సిడెంట్ చేయాలి, మీరు ఐదు వందలు ఇస్తారు, వాళ్లు ఐదు వేలు ఇస్తారని అంటున్నాడని సేనాపతి వర్కర్ అంటాడు. నిన్ను పనిలో పెట్టుకుంది మాకోసమా, నీ పెత్తనాలకా, నిన్ను పంపిన తుగ్లక్‌కు ఫోన్ చేయమని సేనాపతి చెబుతాడు. ఫోన్ తీస్తుంటే అతని పాకెట్‌లోనుంచి చందు ఫొటో కింద పడుతుంది.

రేయ్ రామరాజు మమ్మల్ని ఎంత బాధపెట్టార్రా. దానికి పదింతలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి అని సేనాపతి అనుకుంటాడు. మరోవైపు ధీరజ్ దగ్గర తన కాఫీ గురించి తనే పొగుడుకుంటుంది. కుక్కపిల్ల తాగినట్లు ఏంటా సౌండ్, నోరు మూసుకుని తాగు అని తిడతాడు ధీరజ్. అయినా ప్రేమ వినదు. అలాగే చేస్తుంది. తర్వాత అది ధీరజ్ తాగిన కాఫీ అని, అందుకే చాలా స్వీట్‌గా ఉందని అంటుంది.

నీ మాటల్లోనే కాదురా, నీ పెదవుల్లో కూడా ఏదో స్వీట్‌నెస్ ఉందని ధీరజ్‌ను అంటుంది ప్రేమ. సిగ్గు లేకుండా ఎంగిలి కాఫీ తాగి ఇంకా మాట్లాడుతున్నావ్ అని ధీరజ్ కోప్పడుతాడు. నా భర్త కాఫీ తాగితే నీకేంట్రా. నువ్వు తాగు నీకు తెలుస్తుంది అని ధీరజ్ పెదాల ముందు కాఫీ పెడుతుంది. కానీ, ధీరజ్ పక్కకు నెట్టేస్తాడు. కాఫీతో నీ కోపం పోవాలని చూస్తే ఇంకా కోపం పెంచుకుంటావేంట్రా, నా ప్రేమ కాకాలు పట్టినట్లు ఉందా అని ప్రేమ అంటుంది.

అమూల్య కాఫీని తిట్టిన ధీరజ్, అసలు నిజం తెలుసా?

వాడు నీ మంచితనం అర్థం చేసుకున్నరోజు పశ్చాత్తాపపడతాడు. నేను నిన్ను కాలేజ్‌లో డ్రాప్ చేస్తాను పదా అని చందు ప్రేమను తన బైక్‌పై తీసుకెళ్తాడు. మరోవైపు యాక్సిడెంట్‌లో భాగంగా భాగ్యం భర్త రోడ్‌పై మేకులు వేస్తాడు. అదే రోడ్‌లో ప్రేమతో చందు వస్తాడు. ఎదురుగా లారీ కూడా వస్తుంది. నా భర్తకు ఏం కాకూడదు. చిన్నగా కాలు బెణకాలి అంతే అని దేవుడిని మొక్కుకుంటుంది శ్రీవల్లి. కూతురు పక్కనే భాగ్యం దంపతులు సరసాలు ఆడుతారు.

దాంతో శ్రీవల్లి కోప్పడుతుంది. అల్లుడు గారికి ఏం కాదని భాగ్యం హామీ ఇస్తుంది. లారీని పక్కకు ఆపి ఉంటాడు డ్రైవర్. చందుతో ప్రేమ కూడా ఉందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. బైక్ టైర్‌కు మేకులు గుచ్చుకోవడంతో పంచర్ అవుతుంది. నేను ధీరజ్‌కు ఫోన్ చేస్తే కచ్చితంగా వస్తాడు అని కాల్ చేస్తాడు చందు. జరిగింది చెబుతాడు. ధీరజ్ రానని అంటాడు. శివాలయం రోడ్‌లో ఉన్నాం, త్వరగా రమ్మని చందు అంటాడు.

వాడు ఇలాంటివి చాలా చేశాడని తల్లి చెబుతుంది. చందు వైపు లారీ రావడం ప్రేమ చూస్తుంది. బావ అని ప్రేమ పిలిచిన వినపడదు. దాంతో చందును పక్కకు తప్పిస్తుంది ప్రేమ. కానీ, లారీ ప్రేమను గుద్దేసినట్లు చూపిస్తారు. అమ్మా అంటూ ప్రేమ అరుస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరింత ఉత్కంఠగా సాగుతోంది. ప్రేమకు జరిగిన ప్రమాదం, సేనాపతి పగ ఎలా రివర్స్ అవుతుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.