
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై సంచలనం నెలకొంది. పైరసీ, బెట్టింగ్ కేసులో చిక్కిన రవికి శిక్ష పడుతుందన్న నేపథ్యంలో, అతని తండ్రి అప్పారావు సీపీ సజ్జనార్‌ను కన్నీళ్లతో వేడుకున్నారు. కూతురి భవిష్యత్తు కోసం దయచేసి తన కొడుకుకు తక్కువ శిక్ష పడేలా చూడమని విజ్ఞప్తి చేశారు.
Key Points
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
సీపీ సజ్జనార్ మీడియాతో రవి నేరాల గురించి, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల గురించి షాకింగ్ వివరాలు వెల్లడించారు.
ఇమ్మడి రవి తండ్రి అప్పారావు తన కొడుకు చేసిన తప్పుకు శిక్ష సరైనదే అని అంగీకరించారు.
అయితే, తన కొడుకు కూతురి భవిష్యత్తు కోసం కనీసం తక్కువ శిక్ష వేయమని సీపీ సజ్జనార్‌ను కన్నీళ్లతో కోరారు.
ఇమ్మడి రవి అరెస్ట్: ఐబొమ్మ పైరసీ కేసు వివరాలు
Emandi Ravi: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ ఇబ్బంది పెడుతున్న రవిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో, సినిమా ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్ సైతం మీడియాతో మాట్లాడుతూ రవి(Emandi Ravi) గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అయితే, కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా చేశాడట రవి. దీంతో అతనికి కఠినమైన శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Ntr: ఆఫ్రికా వెళ్తున్న ఎన్టీఆర్.. ఇక నుంచి అక్కడే.. కారణం ఏంటంటే..
సీపీ సజ్జనార్‌కు ఇమ్మడి రవి తండ్రి విన్నపం
ఈ వ్యవహారంపై రవి తండి అప్పారావు స్పందించారు. తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నాం కానీ, ఇలాంటి పని చేస్తున్నాడని తమకు తెలియదని చెప్పాడు. తప్పు ఎవరు చేసిన తప్పే కాబట్టి శిక్ష వేయడం సబబే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా మరో వీడియో విడుదల చేశాడు అప్పారావు. ఈ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. “సజ్జనార్ సార్.. దయచేసి స్టేషన్‌లో మావాడిని ఇబ్బంది పెట్టకండి. మీ బాధ్యతలను కాదని వాడిని విడిచిపెట్టమని నేను అడగడం లేదు.
కుమార్తె భవిష్యత్తు గురించి కన్నీళ్లు
వాడికి ఒక కూతురు ఉంది. తన గురించి తలుకుంటే ఏడుపు వస్తుంది. కనీసం ఆ బిడ్డ గురించి ఆలోచించి వాడికి తక్కువ శిక్ష పడేలా చేయండి. నా కోడలు నాతో మాట్లాడదు. మా కన్నీళ్లు చూసి సజ్జనార్ సార్‌కు జాలీ కలగొచ్చు కానీ, ఆయనది కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు” అంటూ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పారావు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రవి తండ్రి ఎమోషనల్ రిక్వెస్ట్ పై సజ్జనార్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
అప్పారావు కన్నీటి ప్రార్థన వైరల్ అయ్యింది. రవి తప్పు ఒప్పుకున్నా, అతని కుటుంబ బాధ స్పష్టంగా కనిపించింది. మరి సీపీ సజ్జనార్ ఈ విన్నపంపై ఎలా స్పందిస్తారు, ఇమ్మడి రవికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.


