|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమలో మోసం.. ఫిజికల్‌గా వాడుకుని వదిలేశాడు: ఇనయా బ్రేకప్ కథనం!

Published: 29-12-2025, 8:42 AM
ప్రేమలో మోసం.. ఫిజికల్‌గా వాడుకుని వదిలేశాడు: ఇనయా బ్రేకప్ కథనం!
  • ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
  • తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బ్రేకప్ స్టోరీ గురించి బయటపెట్టింది.
  • ప్రేమించిన వ్యక్తి నన్ను ఫిజికల్‌గా వాడుకుని, మోసం చేసి వదిలేశాడని కన్నీళ్లతో చెప్పింది.
  • ఇకపై ఎవరినీ ప్రేమించనని, సోలో లైఫ్ చాలా మెరుగైనదని ఇనయా ప్రకటించింది.

బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ నిజాలు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని కన్నీళ్లతో పంచుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి తనను ఫిజికల్‌గా వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఇనయా సుల్తానా: బిగ్ బాస్ నుండి బ్రేకప్ వరకు

Inaya Sultana : బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఇనయా. అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోగోడుతుంది. అయితే ఈ మధ్య వరుసగా సినిమాలు కూడా చేయడంతో నిత్యం సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో తన బ్రేకప్ స్టోరీ గురించి బయటపెట్టింది. కన్నీళ్లు తెప్పిస్తున్న తన ఎమోషనల్ స్టోరీ గురించి మనం వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తాన ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. వెబ్ సిరీస్ లు చేస్తుంది. తన కెరీర్ ను బిజీగా మార్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అంతేకాదు బ్రేకప్ పై మొదటిసారి నోరు విప్పింది. ఈ ఇంటర్వ్యూ లో తన బ్రేకప్ గురించి అడగ్గా.. నా బ్రేకప్ గురించి చెప్పాలని ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు జనాలకు చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను నా ఇంట్లో వాళ్ళందరూ దూరం పెట్టడంతో నాకంటూ ఒక మనిషి కావాలని అనుకున్నాను. అలాంటి వీక్ సమయంలోనే నన్ను వాడుకోవాలని చాలామంది చూశారు.. కానీ నేను మాత్రం ఓ వ్యక్తి కేరింగ్ ని చూసి అతని ప్రేమలో పడిపోయాను… ఎంతగా అంటే అతనితో నా జీవితం అని అనుకున్నాను కాబట్టే రిలేషన్ స్టార్ట్ చేశాను. కానీ ఆ వ్యక్తి మాత్రం నన్ను నా ఫేమ్ ని వాడుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనగానే ఏదో ఒక వంక చెప్పేసి నన్ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు అతన్ని ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు. నా మనసుని ముక్కలు చేశాడు. ఇకమీదట ఎవరితో ప్రేమలో పడను. సోలో లైఫ్ సో బెటర్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఇనయ సుల్తాన.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సలహాలు ఇస్తున్నారు.

కన్నీళ్లతో బ్రేకప్ స్టోరీ వెల్లడి

ప్రేమలో మోసం.. సోలో లైఫ్ బెస్ట్

ఇనయ తనకు నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి రావాలని అనుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా కుటుంబానికి దూరమైంది. తన కుటుంబానికి దూరంగా ఉన్న విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో బయట పెట్టింది. అయితే ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతారు. ఒకప్పుడు నా కుటుంబానికి దూరంగా ఉన్నానని అన్నావు కదా.. మరి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి పోయావా అని అడుగుతారు. దానికి ఆమె సమాధానం చెబుతూ.. బిగ్ బాస్ కి నేను వెళ్తున్నాను అని మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏదైనా చేసుకో ఇప్పటివరకు చేసింది చాలదా అని తిట్టారు. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కి 11 వారాలు పాటు నేను హౌస్ లో ఉంటే మా వాళ్ళు నాకోసం వస్తారా లేదా చూడాలి అని అన్నాను. 11వ వారం నాకోసం మా వాళ్ళు వచ్చారు అది మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేను అని ఇనయ చెప్పింది. ప్రస్తుతం మీ వాళ్ళతో ఉన్నావా అని అడగ్గా.. నేను ఒంటరిగానే ఉంటున్నాను. మా అమ్మ అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర  కొన్ని రోజులు ఉండి వెళుతుంది అని అంది. ఇకపోతే ఇనయా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా 3 రోజెస్ వెబ్ సిరీస్ లో నటించింది.

ఇనయా సుల్తానా హృదయ విదారక బ్రేకప్ స్టోరీ యువతకు ఒక హెచ్చరిక. ప్రేమ పేరుతో మోసపోవద్దని ఆమె ఇచ్చిన సందేశం వైరల్ అవుతోంది. ఈ కష్టకాలంలో ఇనయా ధైర్యంగా ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.