
📌 Key Points
- ‘కుర్చీని మడతపెట్టి’ డైలాగ్‌తో కుర్చీ తాత ఎంతో పాపులర్ అయ్యారు.
- సోషల్ మీడియాలో ఇటీవల కుర్చీ తాత మరణించారని పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.
- తాను బతికే ఉన్నానని, తన మరణ వార్తలు రాసిన వారిపై కుర్చీ తాత వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఆయన భార్య ఆసియా సుల్తానా స్పందిస్తూ, కుర్చీ తాత క్షేమంగా వరంగల్‌లో ఉన్నారని స్పష్టత ఇచ్చారు.
సోషల్ మీడియాలో కుర్చీ తాత మరణించినట్లు పుకార్లు షికారు చేశాయి. దీనిపై కుర్చీ తాత తీవ్రంగా స్పందించారు. తాను బతికే ఉన్నానని, తప్పుడు వార్తలు రాసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇది అభిమానులను షాక్‌కు గురిచేసింది.
కుర్చీ తాత: సెలబ్రిటీ నుండి పుకార్ల వరకు
Kurchi Thatha Death News : ఆ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ ఉండే ఓ ముసలాయన ఇంటర్వ్యూలో భాగంగా ఆ కుర్చీ మడత పెట్టి అంటూ ఒక బూతు పదం మాట్లాడారు. ఇది భారీగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఏకంగా సినిమాలో పాటను కూడా క్రియేట్ చేశారు. దీంతో కుర్చీ తాత సెలబ్రిటీ రేంజ్ లో పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల ఈయన బయట పెద్దగా కనిపించని నేపథ్యంలో మరణించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.
గత కొంతకాలంగా ఈయన కనిపించని నేపథ్యంలో ఈయన చనిపోయారంటూ వార్తలు రావడంతో అందరూ అయోమయంలో పడ్డారు. కుర్చీ తాత నిజంగానే చనిపోయారా? లేక బ్రతుకున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.. ఇలా తన మరణం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరికి కుర్చీ తాత స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు .ఇందులో భాగంగా తాను చనిపోయానంటూ వార్తలను రాసిన వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త ఎవరైతే రాశారో వాళ్ళు కనిపిస్తే కచ్చితంగా నేను చంపేస్తాను అంటూ ఫైర్ అవ్వడమే కాకుండా బ్రతికుండగానే నన్ను చంపేశారు కదరా అంటూ మండిపడ్డారు. ఇలా కుర్చీ తాత మరణ వార్త విని తన భార్య కూడా కంగారుపడి బాగా ఏడ్చిందని, ఇలాంటి తప్పుడు వార్తలను ఇంకోసారి రాయద్దు అంటూ ఈయన తెలిపారు.
ఇక కుర్చీ తాత మరణం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భార్యతో వైజాగ్ సత్య మాట్లాడించారు. తన పేరు ఆసియా సుల్తానా అని తెలిపారు. అయితే కుర్చీ తాత మరణించలేదని గాంధీ హాస్పిటల్ లో ఆయన మృతదేహం ఉందని తెలియగానే అక్కడికి వెళ్ళామని, అది కుర్చీ తాత డెడ్ బాడీ కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వరంగల్ లో ఉన్నారని కుర్చి తాత భార్య ఆసియా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. కుర్చీ తాత మరణం పై ఆయన భార్యతో పాటు ఆయన కూడా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.
నేను చనిపోలేదు: కుర్చీ తాత
‘నన్ను చంపేశారు’: కుర్చీ తాత ఆగ్రహం
కుర్చీ తాత ఇక లేరంటూ సోషల్ మీడియాలో ప్రచారం
తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసిన కుర్చీ తాత
తప్పుడు ప్రచారం చేయొద్దన్న కుర్చీ తాత pic.twitter.com/8ANKKMYm54
మరణ వార్తలపై భార్య ఆసియా క్లారిటీ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2025
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరికి సదరు సెలబ్రిటీలు స్పందిస్తూ మేము ఇంకా బ్రతికే ఉన్నామని చనిపోలేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రిటీలను బ్రతికుండగానే చంపిన ఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు కుర్చీ తాత బ్రతికుండగానే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలను ఖండించారు.
కుర్చీ తాత, ఆయన భార్య ఇచ్చిన స్పష్టతతో మరణ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, ఇతరుల మనోభావాలను గౌరవించాలని ఈ ఘటన గుర్తు చేస్తుంది.


