
📌 Key Points
- భారత్ శిశు మరణాల రేటు తగ్గింపులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
- ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 1990 నుండి 76% తగ్గాయి.
- 2000 సంవత్సరంలో 1,000 జననాలకు 92 మరణాలు ఉండగా, 2024లో 32కు తగ్గాయి.
- టీకా కార్యక్రమాలు, ఆసుపత్రి సంరక్షణ కేంద్రాలు మెరుగుదల కారణంగా మరణాల రేటు తగ్గింది.
భారతదేశం శిశు మరణాల రేటును తగ్గించడంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. నవజాత శిశువులు మరియు ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించడంలో భారత్ చేసిన కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది.
భారత్‌ను ప్రశంసించిన ఐక్యరాజ్యసమితి
శిశుమరణాల రేటును తగ్గించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి కితాబిచ్చింది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల తగ్గింపులో భారత్ నిరంతరంగా పెద్ద ఎత్తున కృషి చేసినట్లు తాజాగా ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్ (UNIGME) 2025 నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో భారత్ చేపట్టిన భారీ స్థాయి ఆరోగ్య సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. గడిచిన రెండు దశాబ్దాలుగా దక్షిణాసియా ప్రాంతంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, 1990తో పోలిస్తే ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 76 శాతం తగ్గగా, 2000 సంవత్సరం నుండి ఈ తగ్గుదల 68 శాతంగా నమోదైందని పేర్కొంది. ఈ భారీ మార్పులో భారతదేశం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించింది. 2000 సంవత్సరంలో ప్రతి 1,000 మంది సజీవ జననాలకు 92 గా ఉన్న మరణాల రేటు, 2024 నాటికి 32 కి తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది.
చాలా వరకు శిశు మరణాలు సరైన చికిత్స లేదా నివారణ చర్యలతో అడ్డుకోవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది. భారత్ ముఖ్యంగా నిమోనియా, అతిసారం (డయేరియా), మలేరియా, పుట్టుకతో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోందని తెలిపింది. భారతదేశంలో అమలవుతున్న పలు ఆరోగ్య కార్యక్రమాలు ఈ విజయానికి పునాదిగా నిలిచాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సార్వత్రిక టీకా కార్యక్రమం (UIP) మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించబడ్డాయని గర్భిణీలు ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రోత్సహిస్తోందని ఆసుపత్రుల్లో ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల (SNCU) ఏర్పాటును ప్రశంసించింది. భారతదేశం ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే భవిష్యత్తులో ఈ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.
శిశు మరణాల తగ్గింపులో గణనీయమైన మార్పు
భారతదేశం చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలు
భారతదేశం తన ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిస్తే, శిశు మరణాల రేటును మరింత తగ్గించవచ్చు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చు.


