
📌 Key Points
- ఇరాన్ నుండి భారతీయులు వెంటనే వెళ్లిపోవాలని భారత ఎంబసీ ఆదేశించింది.
- అమెరికా కాల్పుల విరమణ ప్రకటించినా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని హెచ్చరిక.
- ఎంబసీ అధికారులతో సంప్రదిస్తూ సురక్షిత మార్గాల్లో తరలింపు పూర్తి చేయాలని సూచన.
- సహాయం కోసం ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని ప్రకటన.
ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. అమెరికా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, వీలైనంత త్వరగా ఇరాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంబసీ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది.
భారతీయులకు భారత ఎంబసీ సూచన
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)కి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాటు విరామం (Cease Fire) ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy Advisory) కీలక అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని (Expeditiously) సూచించింది. పౌరులంతా ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సూచించిన సురక్షిత మార్గాల్లోనే తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
సురక్షితంగా తరలింపు ప్రక్రియ
అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని ఎంబసీ గట్టిగా హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి కదలిక ఎంబసీ సమన్వయంతోనే జరగాలని, అప్పుడే భద్రతకు గ్యారంటీ ఉంటుందని స్పష్టం చేశారు. భారతీయుల సహాయార్థం ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. సహాయం కావలసినవారు +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359 అనే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.
ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో
అంతకుముందు.. భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులందరూ 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ సూచించిన సంగతి తెలిసిందే. సైనిక స్థావరాలకు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని, భవనాల పై అంతస్తుల్లోకి వెళ్లకూడదని గతంలోనే హెచ్చరించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉండేవారు కూడా తమ గదులకే పరిమితం కావాలని, అధికారులతో టచ్‌లో ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణాలు చేసే ముందు ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు తేల్చి చెప్పారు.
ఇరాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా భారత ఎంబసీ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఎంబసీతో సంప్రదింపులు జరుపుతూ సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నాము.


