|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారత ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ సంక్షోభం బ్రేక్? జీడీపీ అంచనాలు దిగువకు!

Published: 07-05-2026, 12:00 AM
భారత ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ సంక్షోభం బ్రేక్? జీడీపీ అంచనాలు దిగువకు!
  • ఎస్‌అండ్‌పీ గ్లోబల్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని 6.6%కి తగ్గించింది.
  • అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రధాన కారణాలు.
  • ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్యానికి ఏటా 8% పైగా వృద్ధి అవసరం.
  • మూడీస్, ఏడీబీ అంచనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, సంస్కరణల ఆవశ్యకత స్పష్టం.

అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6%కి పరిమితం కావచ్చని పేర్కొంది. ఇది ‘వికసిత్ భారత్’ లక్ష్యాలపై ప్రభావం చూపనుంది.

అంచనాల తగ్గింపు: కారణాలు, ప్రభావం

భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్న మేరకు వృద్ధిని సాధించలేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ (S&P) గ్లోబల్ సంస్థ అంచనా వేసింది. సంస్థ తాజా నివేదిక ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు కొంత నెమ్మదించి 6.6 శాతానికి పరిమితం కానుందని పేర్కొంది. గతంలో ఈ వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఈ అంచనాలను సవరించడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మాత్రం వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే ఈ అంచనాల తగ్గింపుకు ప్రధానంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణమని ఎస్‌అండ్‌పీ విశ్లేషించింది.

దెబ్బ తీయనున్న పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు

పశ్చిమ ఆసియా సంక్షోభం: ముప్పులు

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరిగే ముప్పు ఉందని అంచనా వేస్తోంది. అలాగ దిగుమతుల భారం పెరిగి కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం పడటం వంటి అంశాలు వృద్ధిని మందగించేలా చేస్తున్నాయి. భారత్ నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటా స్థిరంగా 8 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించాలని ‘ఇండియా ఫార్వర్డ్’ (India Forward) పేరుతో విడుదల చేసిన ఈ జాయింట్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వంటి రంగాల్లో తక్షణ సంస్కరణలు అవసరమని సూచించింది.

భారీగా పెరగనున్న ద్రవ్యోల్భణం

వికసిత్ భారత్ లక్ష్యం: సంస్కరణల ఆవశ్యకత

అయితే మూడీస్ మాత్రం ఈ ఒడిదుడుకులు తాత్కాలికమేనని భారత్ వద్ద ఉన్న భారీ విదేశీ మారక నిల్వల సహాయంతో వీటన్నిటిని తేలిగ్గానే ఎదుర్కోగలుగుతుందని అంచనా వేసింది. మరోవైపు మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతల వల్ల భారత జీడీపీ 6.3% కే పరిమితం కావొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం గణనీయంగా 2.4 శాతం మేర పెరిగి 6.9 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది.

మొత్తంగా, అంతర్జాతీయ సవాళ్లు భారత ఆర్థిక వృద్ధికి ఆటంకాలుగా మారినా, సంస్కరణలు, పటిష్టమైన విధానాలతో ఈ ఒడిదుడుకులను అధిగమించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు ఇది కీలకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.