
ప్రతి ఏడాది వచ్చే 24 ఏకాదశుల్లో ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజు పితృదేవతలను స్మరించుకుని, వారికి తర్పణాలు, దానాలు ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
Key Points
ఇందిరా ఏకాదశి నాడు పితృదేవతలను స్మరించుకోవడం చాలా ముఖ్యం.
పిండప్రదానం, దానధర్మాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు.
ఈ ఏకాదశి వంశాభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఏకాదశి తిథి సమయం తెలుసుకుని పూజలు నిర్వహించండి.
ఇందిరా ఏకాదశి తేదీ, సమయం
ప్రతి ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటాయి. ఈ ఏకాదశుల నాడు ఉపవాసం ఉండే విష్ణుమూర్తిని పూజిస్తారు. పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వస్తుంది. వ్యాసమహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం చూస్తే ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ఆ రోజున పూర్వికులను స్మరిస్తారు. పూర్వీకులకు పూజలు చేయడం వలన శుభఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది.
పితృపక్షం బహుళ పక్షం నుంచి అమావాస్య వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా చనిపోయిన పూర్వీకులకు తర్పణాలు వదలడం, వారి పేరు చెప్పి దానాలు చేయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వలన పితృదేవతలు అనుగ్రహం కలిగి, వంశాభివృద్ధి కలుగుతుంది.
ప్రతి ఏటా భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 17 అంటే ఈరోజు వచ్చింది. పితృదేవతలను స్మరించుకుంటూ పిండప్రదానం చేయడం, దానాలు చేయడం వలన శుభఫలితాలను పొందవచ్చు. పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
పితృదేవతలకు పూజా విధానం
ఇందిరా ఏకాదశి 2025 తేదీ, సమయం
ఏకాదశి తిథి సెప్టెంబర్ 16 మంగళవారం అర్థరాత్రి 2:43 కి మొదలైంది. బుధవారం అర్థరాత్రి 1:15 వరకూ ఉంది. ఈ లెక్కన ఇందిరా ఏకాదశిని సెప్టెంబర్ 17న జరుపుకోవాలని నిర్ణయించారు.
ఇందిరా ఏకాదశి పూజా విధానం
శుభ ఫలితాల కోసం దానధర్మాలు
పితృదేవతల కోసం ఏం చేయాలి?
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇందిరా ఏకాదశి నాడు పితృదేవతలను స్మరించుకుంటూ, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం వల్ల వంశోద్ధారణ జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.


