|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hyper Aadi : అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు.. ఈగోకి వెళ్తాడు.. హైపర్ ఆదిపై ఇంద్రజ కామెంట్స్ వైరల్..

Published: 07-12-2025, 6:49 AM
Hyper Aadi : అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు.. ఈగోకి వెళ్తాడు.. హైపర్ ఆదిపై ఇంద్రజ కామెంట్స్ వైరల్..
  • హైపర్ ఆది కామెడీ, బాడీ షేమింగ్ పంచులపై నటి ఇంద్రజ సంచలన కామెంట్లు చేసింది.
  • ఆది అమ్మాయిలపై పడి ఏడుస్తాడని, ఈగోకి వెళ్తాడని ఇంద్రజ వ్యాఖ్యానించింది.
  • ఆది పంచులేస్తే తీసుకోడని, ఇతరులు వేస్తే తీసుకోడని ఇంద్రజ ఆరోపించింది.
  • వ్యక్తిగా ఆది కష్టపడి పైకి వచ్చాడని, ఇతరులకు సహాయపడతాడని ఇంద్రజ ప్రశంసించింది.

జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆదిపై నటి ఇంద్రజ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆది కామెడీ స్టైల్, బాడీ షేమింగ్ పంచులు, ఈగో ధోరణిపై ఇంద్రజ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది పంచులేస్తే తీసుకోవని తెలిపింది.

ఇంద్రజ సంచలన కామెంట్స్ అసలు కారణం

Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు వేరే టీవీ షోలతో, సినిమాలతో బిజీ అయ్యాడు. ఆది స్కిట్స్ లో కామెడీ పంచులు బాగా వేస్తాడని తెలిసిందే. అయితే ఆది ఎక్కువగా బాడీ షేమింగ్ పంచులు వేస్తాడని, ట్రోలింగ్ కామెడీ చేస్తాడని, అవతలి వాళ్ళని తక్కువ చేసేలా డైలాగ్స్ వేస్తాడని, అప్పుడప్పుడు అడల్ట్ కామెడీ చేస్తాడని అతనిపై విమర్శలు కూడా ఉన్నాయి.(Hyper Aadi)

తాజాగా నటి ఇంద్రజ ఈ విషయంలో హైపర్ ఆది గురించి కామెంట్స్ చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క టీవీ షోలలో జడ్జిగా చేస్తుంది. ఇంద్రజ – ఆది కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపిస్తారు.

ఆది కామెడీ స్టైల్‌పై ఇంద్రజ విమర్శలు

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. స్కిట్స్ లో ఒకరి మీద ఒకరు పంచులేస్తారు. పంచులేయడమే కామెడీ కాదు పంచులేస్తే తీసుకోవాలి కూడా. కానీ ఆది పంచులేస్తే తీసుకోడు. మా మీద పంచులేస్తే తీసుకోవాలి. మేము వేస్తే తీసుకోరు. దానికి ఏదో ఒకటి చెప్తారు. అది చాలా చెత్తగా ఉంటుంది ఆయన ఈగోకి వెళ్తారు. ఆయన పంచ్ వేస్తే తీసుకోలేకపోతున్నాడు.

వ్యక్తిగా ఆదిపై ఇంద్రజ గౌరవం

ఎప్పుడు చూడు అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు. అమ్మాయిల మీద కామెడీ, అమ్మాయిల బాడీ షేమింగ్ చేస్తాడు, అవన్నీ పాత జోకులు అని చెప్తాను. ఆది మీద పంచులేస్తే కూడా జనాలు చూస్తారు. అది ఆయన గమనించట్లేదు. కానీ పర్సన్ గా నాకు ఆయనంటే గౌరవం. వర్క్ పర్సన్. ఎప్పుడూ వర్క్ గురించే ఆలోచిస్తారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ గ్రామం నుంచి వచ్చి అతను ఎదిగాడు. ఆయనకు ఏదైనా ఈవెంట్ వస్తే ఆయన చేయలేకపోతే వేరే వాళ్లకు ఇప్పిస్తాడు అది. ఆయనకు ఈవెంట్ వస్తే వేరే వాళ్ళను తీసుకెళ్తాడు. అలా వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తాడు అని తెలిపింది.

మొత్తంగా, హైపర్ ఆది కామెడీ స్టైల్‌పై విమర్శలు చేసినప్పటికీ, వ్యక్తిగా ఆయన కష్టపడే తత్వం, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఇంద్రజ ప్రశంసించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.