|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లైన హీరోయిన్లని ఇండస్ట్రీ గౌరవించడం లేదు.. దీపికా పదుకొణెకి సపోర్ట్ చేస్తూ బాలయ్య హీరోయిన్‌ కామెంట్‌

Published: 02-06-2025, 10:14 AM
తల్లైన హీరోయిన్లని ఇండస్ట్రీ గౌరవించడం లేదు.. దీపికా పదుకొణెకి సపోర్ట్ చేస్తూ బాలయ్య హీరోయిన్‌ కామెంట్‌

రాధికా ఆప్టే, బాలయ్యతో నటించిన తర్వాత, తల్లి అయిన తరువాత సినిమా పరిశ్రమలోని మహిళలకు ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడింది. దీపికా పదుకొణెకు మద్దతుగా నిలిచింది.

Key Points

1

రాధికా ఆప్టే తల్లి అయిన తర్వాత పనిలో చేరిన విషయం

2

తెలుగు సినిమా పరిశ్రమలో తల్లులైన హీరోయిన్లకు గౌరవం లేదని ఆమె అభిప్రాయం

4

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి రాధికా ఆప్టే అనుభవాలు

రాధికా ఆప్టే కామెంట్స్

`రక్తచరిత్ర`, `లెజెండ్‌`, `లయన్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది రాధికా ఆప్టే. బాలయ్యతో నటించిన `లెజెండ్‌` మూవీ ఆమెకి పెద్ద విజయాన్ని అందించింది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గర చేసింది.

కానీ ఆ తర్వాత చేసిన `లయన్‌` మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె ఇక తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు. అంతేకాదు ఆ మధ్య తెలుగు హీరోపై పరోక్షంగా విమర్శలు కూడా చేసింది.

ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయిన రాధికా ఆప్టే ఇటీవలే తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన వారం తర్వాతే పనిలోకి వచ్చానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దీపికా పదుకొణె కి మద్దతుగా నిలిచింది.

దీపికా పదుకొణె వివాదం

సినిమా రంగం కొత్తగా తల్లైన హీరోయిన్లకి అనుకూలంగా లేదని అన్నారు. తమ పనిని ఎలా మ్యానేజ్‌ చేయాలో వారికి తెలియదని చెప్పింది. మాతృత్వాన్ని రెస్పెక్ట్ చేయడం లేదనే యాంగిల్‌లో రాధికా ఈ కామెంట్ చేసింది.

వర్క్(సినిమా షూటింగ్‌లు), మాతృత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని రాధిక చెప్పింది. “సినిమాల్లో పనిచేయడం చాలా కష్టం, ఎందుకంటే మనం ఎన్ని గంటలు షూటింగ్ చేస్తామో, అంత సేపు పిల్లలను చూసుకోలేం. కాబట్టి దీనికి పరిష్కారం నేను కనుక్కోవాలి” అని ఆమె తెలిపింది.

మాతృత్వం మరియు సినిమా రంగం

దీపికా పదుకొణె.. ప్రభాస్ నటిస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమాను తిరస్కరించిన తర్వాత రాధికా ఆప్టే ఈ వ్యాఖ్యలు చేసింది.

మేకర్స్ దీపికాకి 8 గంటల షిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీనికితోడు అనేక కారణాలతో దీపికా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అటు దీపికా నుంచి, ఇటు సందీప్‌ నుంచి ఈ విషయం వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.  ఇది పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా రాధికా ఆప్టే కామెంట్లు వైరల్‌గా మారాయి.

రాధికా ఆప్టే వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలో తల్లులైన హీరోయిన్లకు ఎదురయ్యే సవాళ్లను వెల్లడిస్తాయి. ఈ విషయంపై చర్చ జరగడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.