|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లైఫ్ అంటే ఇదిరా! ఈ ఒక్క పాట వింటే చాలు.. ఇక రికార్డులే!!

Published: 08-04-2026, 1:05 AM
లైఫ్ అంటే ఇదిరా! ఈ ఒక్క పాట వింటే చాలు.. ఇక రికార్డులే!!
  • సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అద్భుత గీతం ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’.
  • 1992లో విడుద‌లైన ‘ప‌ట్టుద‌ల’ చిత్రం నుంచి స్ఫూర్తిదాయ‌క‌మైన పాట ఇది.
  • కె.జె. ఏసుదాస్ ఆల‌పించ‌గా, ఇళ‌య‌రాజా సంగీతం అందించారు.
  • రామ్ గోపాల్ వ‌ర్మ ఈ పాట‌ను ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు ప‌రిచ‌యం చేశారు.

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! మీరు నిరాశలో ఉన్నారా? అయితే, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఒక అద్భుతమైన పాట మీ జీవితాన్ని మార్చేస్తుంది.

సిరివెన్నెల కలం.. ఓటమికి సవాల్!

సిరివెన్న‌ల క‌లం నుంచి జాలు వారిన అద్భుత పాట‌ల్లో ప‌ట్టుద‌ల మూవీలోని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా ఓట‌మి అనే పాట ఒక‌టి. 1992లో విడుదలైన ‘పట్టుదల’ చిత్రంలోని ఈ స్ఫూర్తిదాయకమైన పాట, ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నాన్ని కొనసాగించమనే సందేశాన్ని చాటుతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతాన్ని కె.జె. ఏసుదాస్ పాడగా, ఇళయరాజా సంగీతం అందించారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే విజయం ఖాయమని ఈ పాట చెబుతుంది.

నిజానికి ఈ పాటను ఈత‌రం జ‌న‌రేష‌న్‌కు పరిచ‌యం చేసింది ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అని చెప్ప‌డంలో సందేహం లేదు. రామూయిజం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్జీవీ ఈ పాట గురించి మాట్లాడారు. త‌న ఉద్దేశంలో ప్రపంచంలోనే ది బెస్ట్ ఇన్‌స్పిరేషనల్ సాంగ్ అంటే ఇదే అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ కింద ఉన్న కామెంట్స్‌లో చాలా మంది యూజ‌ర్లు ఆర్జీవీ చెప్పిన త‌ర్వాతే ఈ పాట‌ను చూస్తున్నామ‌ని పేర్కొన్నారు. నిజానికి ఈ త‌రం వారికి ఈ పాట ఎంతో అవ‌స‌రం. చిన్న చిన్న కార‌ణాల‌కే, ఓట‌మిల‌కు కుంగిపోతున్న యువ‌త ఈ పాట‌లోని అర్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇంత‌కీ పాట‌లో ఉన్న అంత‌టి గొప్ప‌త‌నం ఏంటో చూద్దాం.

మ‌నిషి జీవితంలో క‌ష్టాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌నే సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. అయితే దానిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డ‌మే మ‌నిషి చేయాల్సిన ప‌ని అని శాస్త్రి ఈ పాట ద్వారా తెలిపారు. ఈ పాట‌లోని.. ‘నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, నీరసించి నిలిచిపోతె, నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ , దేహముంది ప్రాణముంది, నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా’ అనే లైన్ అద్భుతంగా ఉంటుంది.

ప్రతీ మనిషికి జీవితంలో నిరాశ పుట్టడం సర్వసాధారణం. అయితే నిరంతరం కృషి చేస్తే ఆ నిరాశ‌కు కూడా నిరాశ పుడుతుంద‌ని శాస్త్రి ఈ పాట‌లో చ‌క్క‌గా చెప్పారు. ఆకాశం ఎంత పెద్ద‌గా ఉన్నా ఎగిరే గువ్వ పిల్ల రెక్క ముందు చిన్న‌దే క‌దా అంటారు. అలాగే స‌ముద్రం ఎంత పెద్ద‌ద‌యినా ఈదే చేప‌పిల్ల మొప్ప ముందు చిన్న‌దేగా అని అభివ‌ర్ణించారు. అలాగే ప‌శ్చిమాన సూర్యుడు అస్త‌మించినా మ‌ళ్లీ ఉద‌యం తూర్పున ఉద‌యిస్తాడు. కాబ‌ట్టి ఎప్పుడూ ఓట‌మిని ఒప్పుకోవ‌ద్ద‌నే గొప్ప సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. ఇదిలా ఉంటే శాస్త్రి రాసిన పాట‌లోని కొన్ని లైన్స్‌ను పాట‌లో పెట్ట‌డానికి ప‌ట్టుద‌ల చిత్ర యూనిట్ అంగీక‌రించ‌లేదంటా. దీంతో సినిమా కోసం కొన్ని చ‌ర‌ణాల‌ను మార్చిన‌ట్లు సిరివెన్నెల స్వ‌యంగా తెలిపారు. అయితే సినిమాలో పాట‌కంటే శాస్త్రి స్వ‌యంగా పాడిన పాటకు మ‌రింత ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింది. శాస్త్రి పాడిన పాట‌ను ఇక్క‌డ వినండి.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

రాంగోపాల్ వర్మ చెప్పాకే ఈ పాట వైరల్ అయింది!

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య

గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ

పాటలో ప్రతి లైన్ ఒక స్ఫూర్తిదాయకం!

ఉషోదయాన్ని ఎవ్వడాపురా..!!

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీదికాదు

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది

ఆశ నీకు అస్త్రమవును.. శ్వాస నీకు శస్త్రమవును

ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక

ఈ పాట వింటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఓటమిని జయించే శక్తి మీ సొంతమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.