
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Key Points
మనీషా కోయిరాలాకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకుంది.
జీవితంలోని కష్టాలను అధిగమించి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నట్లు పేర్కొంది.
నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
మనీషా కోయిరాలాకు గౌరవ డాక్టరేట్
బాలీవుడ్ బ్యూటీ మనీషా కోయిరాలా(Manisha Koirala) ‘బొంబై’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చింది. హిందీలో ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సరసన ‘బాబా’(baba) మూవీలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. దీంతో కోలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. బాలీవుడ్‌లోనే కొద్ది కాలంపాటు రాణించింది. చివరగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ ద్వారా ప్రేక్షకులను అలరించింది. తాజాగా, మనీషా కోయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఎమోషనల్ పోస్ట్
‘‘ఈరోజు, నేను బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాను.నేను ఇక్కడ సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా వచ్చిన వ్యక్తిగా కాదు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వైఫల్యాల నుంచి నేర్చుకున్న వ్యక్తిగా నిలబడ్డాను. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత విలువైనది. మీరు ఎక్కడ ప్రారంభించినా, మీ ప్రయాణం ముఖ్యమైనదని ఇది రుజువు చేస్తుంది. నా కథలో విలువను చూసినందుకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు. పెరుగుతూనే ఉండండి.. ప్రకాశిస్తూ ఉండండి. మా అమ్మమ్మ నుంచి జీవిత విలువలు భరతనాట్యం, మణిపురి నృత్యం పుస్తకాలు చదవడం వంటివి నేర్చుకున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా డాక్టరేట్ అందుకున్న వీడియోను కూడా షేర్ చేసింది.
నెటిజన్ల అభినందనలు
A post shared by Manisha Koirala (@m_koirala)
మనీషా కోయిరాలా సాధించిన ఈ గొప్ప విజయం ఆమెకు మాత్రమే కాదు, అన్ని రంగాలలోని మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమెకు భవిష్యత్తులో మరెన్నో విజయాలు లభించాలని కోరుకుందాం.


