
ప్రపంచ ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రుచి గుజ్జార్ తన ప్రత్యేకమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె ధరించిన లెహంగా, ప్రధాని మోడీ బొమ్మల హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Key Points
రుచి గుజ్జార్ కాన్స్‌లో రూపా శర్మ డిజైన్ చేసిన బంగారు లెహంగా ధరించి అందరినీ ఆకట్టుకుంది.
ఆమె ధరించిన లెహంగాలో క్లిష్టమైన మిర్రర్ వర్క్, సాంప్రదాయ గోటా పట్టి, అందమైన ఎంబ్రాయిడరీ ఉన్నాయి.
రుచి గుజ్జార్ ప్రధాని మోడీ బొమ్మల హారం ధరించడం ప్రత్యేక ఆకర్షణ.
ఈ లుక్ తో ఆమె ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.
రుచి గుజ్జార్ కాన్స్‌లో సందడి
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ వ్యాప్తంగా నటీమణులు, మోడల్స్ డిజైనర్ గౌన్లు వేసుకుని సందడి చేస్తారు. అందరిని ఆకట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. మన ఇండియన్ నటి రుచి గుజ్జార్.. రూపా శర్మ డిజైన్ చేసిన బంగారు లెహంగా ధరించారు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
ఈ లెహంగాలో క్లిష్టమైన మిర్రర్ వర్క్, సాంప్రదాయ గోటా పట్టి, అందమైన ఎంబ్రాయిడరీ ఉన్నాయి. జైపూర్ ప్రసిద్ధి చెందిన కళా నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చూపించింది రుచి గుజ్జార్.
ప్రత్యేకమైన లెహంగా డిజైన్
రుచి గుజ్జార్ లెహంగాతో జరిబారి రామ్ డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించారు. ఆమె బంధని దుపట్టా, గోటా పట్టితో అలంకరించబడి, రాజస్థాన్ గొప్ప వస్త్ర చరిత్రను ప్రతిబింబిస్తుంది. కాన్స్ లో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వైపే అందరి చూపు నెలకొంది.
మోడీ బొమ్మల హారం ఆకర్షణ
రుచి గుజ్జార్ తన దుస్తులతో పాటు ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించారు. “ఇది ఆభరణాలకు మించి, శక్తి, దార్శనికత, ప్రపంచ వేదికపై భారతదేశ ఉదయాన్ని సూచిస్తుంది” అని ఆమె అన్నారు. ఆమె ఈ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇండియన్ మీడియాలో ఆమె సంచలనంగా మారింది.
రుచి గుజ్జార్ తన అద్భుతమైన దుస్తులతో కాన్స్‌లో తనదైన ముద్ర వేసింది. మోడీ బొమ్మల హారం ఆమెకు అదనపు ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఇండియన్ మీడియాలో ఆమె సంచలనంగా మారింది.


