
📌 Key Points
- iOS 26.4 అప్‌డేట్‌లో కొత్త ఎమోజీలు, ఫీచర్లు రానున్నాయి.
- మార్చి 23 నుంచి iOS 26.4 పబ్లిక్ రిలీజ్ అందుబాటులోకి వస్తుంది.
- కొత్త అప్‌డేట్‌లో ఆపిల్ మ్యూజిక్ యాప్‌లో ప్లేలిస్ట్ ప్లేగ్రౌండ్ ఫీచర్ రానుంది.
- ఆపిల్ కీబోర్డ్‌లో కొత్త ఎమోజీలు, రిమైండర్ యాప్‌లో ఎమర్జెన్సీ రిమైండర్‌ల ఫీచర్ రానుంది.
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్! iOS 26.4 అప్‌డేట్ త్వరలో విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు, ఎమోజీలతో పాటు ఆపిల్ మ్యూజిక్ మరియు కీబోర్డ్‌లో అనేక మార్పులు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
iOS 26.4 రిలీజ్ ఎప్పుడు?
iOS 26.4 Release : కొత్త ఐఓఎస్ 26.4 అప్‌డేట్ రిలీజ్ కానుంది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు, ఎమోజీలు ఉండనున్నాయి. ఏయే ఐఫోన్లలో కొత్త ఐఓఎస్ అప్ డేట్ సపోర్టు చేస్తుందో లిస్టు ఓసారి చెక్ చేయండి.
iOS 26.4 Release : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ సాధారణంగా ప్రతి ఒకటి లేదా రెండు నెలలకు ఒకసారి iOS కోసం కొత్త అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తుంది. ఈసారి iOS 26.4 అప్‌డేట్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ అప్‌డేట్‌తో పాటు అనేక కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇందులో ఆపిల్ మ్యూజిక్ యాప్, ఆపిల్ కీబోర్డ్, అలాగే మరికొన్ని సిస్టమ్ యాప్‌లలో కూడా మార్పులు ఉండనున్నాయి. ఈ కొత్త ఫీచర్లన్నింటికి సంబంధించి కొత్త అప్‌డేట్‌కు సపోర్టు చేసే ఐఫోన్లకు సంబంధించి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
iOS 26.4 రిలీజ్ ఎప్పుడంటే? : లేటెస్ట్ iOS 26.4 అప్‌డేట్ రిలీజ్ గురించి ముందుగానే ఆపిల్ ధృవీకరించింది. ఈ అప్‌డేట్ మార్చి 18 నుంచి టెస్టర్లు, డెవలపర్‌ల కోసం అందుబాటులో ఉంది. ఇక పబ్లిక్ రిలీజ్ విషయానికి వస్తే మార్చి 23 నుంచి అందుబాటులో ఉంటుంది.
iOS 26.4లో కొత్త ఫీచర్లు ఏంటి?
iOS 26.4: ఫీచర్లు క్యాండిడేట్ రిలీజ్ అయ్యే లేటెస్ట్ అప్‌డేట్ కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కీబోర్డ్ విషయానికి వస్తే.. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఆపిల్ కీబోర్డ్ యాప్‌కు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. కీబోర్డ్‌లోని ఎమోజీ కేటగిరీకి ఓర్కా, ట్రోంబోన్, కొండచరియ, బ్యాలెట్ డాన్సర్, డిసోర్టెడ్ ఫేస్ వంటి సుమారు 8 కొత్త ఎమోజీలను తీసుకువస్తుంది.
Read Also : iPhone 17 Pro : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో భారీగా తగ్గిందోచ్.. ఇంత కన్నా తక్కువకు మళ్లీ దొరకదు!
ఆపిల్ మ్యూజిక్‌కు కొత్త ఫీచర్లు కూడా వస్తున్నాయి. అందులో మొదటిది, ‘ప్లేలిస్ట్ ప్లేగ్రౌండ్’ అనే కొత్త ఏఐ ఫీచర్ ఉంది. యూజర్లు షేర్ చేసుకున్న ఆధారంగా ప్లేలిస్ట్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌ల కోసం అనేక కొత్త యూఐ డిజైన్ మార్పులు కూడా ఉన్నాయి.
సపోర్ట్ చేసే ఐఫోన్లు ఏవి?
అలాగే, స్పాటిఫై యాప్ మాదిరిగానే ఆపిల్ మ్యూజిక్ కూడా మీకు దగ్గరలోని కచేరీల వివరాలను చూపించే ఫీచర్‌ను అందిస్తుంది. ఆపిల్ మ్యూజిక్ యాప్‌కు ప్రత్యేకమైన ‘కచేరీలు’ సెక్షన్ లభిస్తుంది. వినియోగదారుల ప్రాంతంలో జరిగే సమీప కచేరీల సమాచారాన్ని అందిస్తుంది.
ఇతర యాప్‌ల విషయానికొస్తే.. కొత్త మార్పులు రానున్నాయి. ఉదాహరణకు.. రిమైండర్స్ యాప్ ఎమర్జెన్సీ రిమైండర్‌ల కోసం కొత్త ‘అర్జెన్ట్’ స్మార్ట్ లిస్ట్‌ను అందిస్తుంది. హెల్త్ యాప్ కొత్త స్లీప్, కీలకమైన డేటాను అందిస్తుంది. ఫ్రీఫార్మ్ యాప్ అడ్వాన్స్ ఇమేజ్ క్రియేషన్, ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి.
iOS 26.4 సపోర్టు ఐఫోన్లు ఇవే : లేటెస్ట్ iOS 26.4 అప్‌డేట్‌ను పొందే ఐఫోన్లు వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
iOS 26.4 అప్‌డేట్ ఆపిల్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. కొత్త ఫీచర్లను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఐఫోన్ మోడల్ సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి.


