
📌 Key Points
- బహ్రెయిన్‌లోని బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో దాడి చేసింది.
- రిఫైనరీలో భారీ మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు.
- అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రాణనష్టం తక్కువగా ఉందని సమాచారం.
- గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బహ్రెయిన్‌లోని ఒక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో మిస్సైల్స్ మరియు డ్రోన్లను ఉపయోగించడంతో రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
బహ్రెయిన్‌లో ఆయిల్ రిఫైనరీపై దాడి
గల్ఫ్ రీజియన్‌లో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain)లోని సిత్రా (Sitra) ద్వీపంలో ఉన్న ‘బాప్కో’(Bapco) ఆయిల్ రిఫైనరీపై 75 మిస్సైళ్లు, 123 డ్రోన్లతో ఇరాన్ (Iran) విరుచుకుపడింది. దీంతో ఆ రిఫైనరీలో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని, పెద్దగా ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సైనిక చర్యలకు ప్రతికారంగా ఇరాన్ పొరుగు దేశాల్లోని చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. తాజాగా దాడి వల్ల బాప్కో రిఫైనరీ కార్యకలాపాలకు కొంత అంతరాయంతో పాటు ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
మంటల్లో చిక్కుకున్న రిఫైనరీ, భయాందోళనలో స్థానికులు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయ్
ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. పూర్తి వివరాలు త్వరలో అప్‌డేట్ చేయబడతాయి.


