
📌 Key Points
- ఢిల్లీలోని మాల్వియా నగర్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం, 21 మంది మృతి.
- వంట మనిషి కేశవ్ నేగి చిన్న పొరపాటే ప్రమాదానికి కారణం.
- ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అవ్వడంతో చాలామంది లోపలే చిక్కుకుపోయారు.
- హోటల్ యాజమాన్యం భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో వెల్లడి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మాల్వియా నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుక్ నిర్లక్ష్యం, యాజమాన్యం భద్రతా ఉల్లంఘనలే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు.
ప్రమాదానికి కారణం: కుక్ నిర్లక్ష్యం
దేశ రాజధాని అయిన ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ (‘Lemon Green Restaurant’) బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి హోటల్ లో పనిచేసే వంట మనిషి చెసిన చిన్న పొరపాటు కారణంగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు హోటల్ కుక్ కేశవ్ నేగిని అరెస్ట్ చేశారు. వంటగదిలో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే అది పేలిపోయిందని, దీంతో భయపడిన కుక్ హోటల్ మెయిన్ పవర్‌ను ఆఫ్ చేసి తన ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగెత్తాడు. అయితే, అతను విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో హోటల్‌లోని ఎలక్ట్రానిక్ తలుపులన్నీ లాక్ అయిపోయి, చాలామంది లోపలే చిక్కుకుపోయారు.
చివరకు బాత్‌రూమ్ తలుపులు రాకపోవడంతో ఒక విదేశీ జంట కూడా ఊపిరాడక మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే హోటల్ యాజమాన్యం అనేక చోట్ల భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిటికీలు, గ్లాస్ ప్యానల్స్ అన్నీ పూర్తిగా మూసి వేయడం వల్ల దట్టమైన పొగ హోటల్ అంతా అలముకుని, బాధితులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. బేస్‌మెంట్ ప్రవేశమార్గానికి తాళం వేసి ఉండటం వల్ల రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లడానికి 10 నిమిషాల సమయం పట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే హోటల్ యజమాని లవ్‌కేష్ బజాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదనే నిజాన్ని ఆయన విచారణలో అంగీకరించారు.
భద్రతా ఉల్లంఘనలు: యాజమాన్యం నిర్లక్ష్యం
పోలీసుల దర్యాప్తు: అరెస్టులు, నిజాలు
ఈ ఘోర ప్రమాదం భద్రతా నిబంధనల అమలులో ఉన్న లోపాలను మరోసారి ఎత్తిచూపుతోంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తుచేస్తుంది.


