
📌 Key Points
- ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
- అమెరికా హామీలను విస్మరించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.
- ఇరాన్ ఓడల రాకపోకలను అమెరికా అడ్డుకుంటోందని ఆరోపణ.
- హర్మూజ్ మార్గం ద్వారా జరిగే వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం.
ఇరాన్ మరోసారి యూటర్న్ తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమ షిప్పులను అడ్డుకుంటున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ మిలిటరీ కమాండ్ వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
హర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
ఇరాన్(Iran) మళ్లీ యూటర్న్ తీసుకుంది. హర్మూజ్ జలసంధి(Hormuz Strait)పై మనసు మార్చుకుంది. తొలుత హర్మూజ్ రాకపోకలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే గంటల వ్యవధిలోనే హర్మూజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ కమాండ్(Iran Military Command) స్వయంగా వెల్లడించారు. అమెరికా(America) హామీలను విస్మరించిందని, ఈ మేరకు హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే షిప్పులను అమెరికా అడ్డుకుంటోందని, వెంటనే ఆ ప్రయత్నాలను నిలిపివేయాలని సూచించింది. అంతేకాదు తమ షిప్పులను అడ్డుకోవడం ఆగేంతవరకూ హర్మూజ్‌పై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.
అమెరికాపై ఇరాన్ ఆరోపణలు
రెండు దేశాల కొట్లాట నడుమ..
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు
కాగా ఇరాన్-అమెరికా మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల మిగిలిన దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. రెండు దేశాల ఆధిపత్య కొట్లాట నడుమ హర్మూజ్ జలమార్గాన్ని మూసివేయడంతో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మార్గం ద్వారా ఆయిల్, గ్యాస్, సరుకులు, ఇతర ఉత్పత్తులు షిప్పుల ద్వారా ఆయా దేశాలకు చేరుతుంటాయి. అయితే యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలమార్గాన్ని మూసివేయడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల విజ్ఞప్తితో హర్మూజ్ రాకపోకలను కొనసాగిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆయా దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. హర్మూజ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మార్గం ద్వారా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతి చేసుకునే దేశాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై వివిధ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాల్సిన అవసరం ఉంది.


