|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుబాయ్‌లో పెను విధ్వంసం! అమెరికాపై ఇరాన్ డ్రోన్ దాడి కలకలం!

Published: 03-03-2026, 5:05 PM
దుబాయ్‌లో పెను విధ్వంసం! అమెరికాపై ఇరాన్ డ్రోన్ దాడి కలకలం!
  • ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.
  • దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది.
  • దాడిలో అమెరికా కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
  • ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు.

ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా దుబాయ్‌లో అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో కాన్సులేట్ భవనం ధ్వంసం అయిందని సమాచారం. ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు.

దుబాయ్‌లో అమెరికా కాన్సులేట్‌పై దాడి

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి ఈ యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఎటాక్ చేస్తున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబీ, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడింది ఇరాన్. ఇక లేటెస్ట్ గా దుబాయిలో మరో డ్రోన్ వదిలింది. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఈ దాడి చేసింది ఇరాన్. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరానియన్ షాహెద్ డ్రోన్ దాడి చేసింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం

ఈ సంఘటనలో అమెరికా కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ చంపేసిన సంగతి తెలిసిందే. అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం పై దాదాపు 30 బాంబులు వేసినట్లు సమాచారం. దీంతో ఒక అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయన ఫ్యామిలీ కూడా చనిపోయింది. ఈ మేరకు ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.

అయతుల్లా అలీ ఖమేనీ మృతి

A post shared by 9News (@9news)

మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. అమెరికా జోక్యంతో పరిస్థితి మరింత దిగజారేలా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.