|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారతీయుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం: కేరళలో ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

Published: 29-03-2026, 9:05 AM
భారతీయుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం: కేరళలో ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!
  • కాంగ్రెస్ ఓట్ల కోసం భారతీయుల ప్రాణాలను పణంగా పెడుతోందని మోడీ విమర్శించారు.
  • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆరోపించారు.
  • గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోడీ తెలిపారు.
  • కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.

కేరళ పర్యటనలో ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ భారతీయుల ప్రాణాలను పణంగా పెడుతోందని ఆరోపించారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌పై మోడీ తీవ్ర విమర్శలు

పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని, ఓట్ల రాజకీయం కోసం కోటి మంది భారతీయుల ప్రాణాలను ఆ పార్టీ పణంగా పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఎన్డీయే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఎల్డీఎఫ్ కూటములపై విరుచుకుపడ్డారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, భారత్‌పై దాని ప్రభావం తక్కువగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యంగా కేరళకు చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని, వారి భద్రత కోసం రాయబార కార్యాలయాలు 24 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇంతటి సున్నితమైన అంతర్జాతీయ సంక్షోభం సమయంలో కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన వారిని ఇబ్బందుల్లో నెట్టేలా ఉన్నాయని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఇంత దిగజారుతుందా? అని నిలదీశారు.

కేరళ రాజకీయాలపై ప్రధాని వ్యాఖ్యలు

ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య మొదలైన ఈ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను (Energy Security) ప్రమాదంలో నెట్టిందని ప్రధాని అన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’పై ఇరాన్ ఆంక్షలు విధించడం ఆందోళనకరమని ఈ క్రమంలో తాను సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల నేతలతో పాటు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మోడీ వెల్లడించారు.

గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతకు భరోసా

కేరళం దశాబ్దాలుగా స్వార్థ రాజకీయాల మధ్య చిక్కుకుపోయిందని ప్రధాని అన్నారు. మేం అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనేక కుంభకోణాలకు పాల్పడుతూ రెండు కూటములు అధికారాన్ని మార్చుకుంటున్నాయన్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు కూటములు పార్టీలు కలిసి పనిచేస్తాయని రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా నటిస్తాయని ఫైర్ అయ్యారు. కేరళ రాజకీయాలపై స్పందిస్తూ.. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటములు రాష్ట్రాన్ని లూటీ చేశాయని ప్రధాని ఆరోపించారు. వీరిద్దరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కేంద్రం పంపే నిధులను రాష్ట్రంలోని పాలకపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కేరళంలో యువత, మహిళలు, రైతులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. కేరళ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

కేరళ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.