
📌 Key Points
- రాష్ట్రపతి ముర్ముకు బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపణలు.
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది.
- ప్రోటోకాల్ వైఫల్యాలపై నివేదిక కోరిన కేంద్రం.
- నిబంధనలు ఉల్లంఘిస్తే రాజ్యాంగపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాళ్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ ఆదివాసి మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని సీఎం మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు, ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉన్నతాధికారులు సరైన క్రమంలో హాజరు కాలేదని ఆరోపణలు వచ్చాయి. దేశ ప్రథమ పౌరురాలికి జరగాల్సిన గౌరవ మర్యాదల్లో లోపం జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
బెంగాల్ సీఎస్‌కు కేంద్రం నోటీసులు జారీ
బెంగాల్ సీఎస్‌కు నోటీసులు
ప్రోటోకాల్ వైఫల్యాలపై కేంద్రం సీరియస్
ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దీనిపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కి నోటీసులు జారీ చేసింది. ప్రోటోకాల్ ఎక్కడ విఫలమైంది? బాధ్యులెవరు? అనే అంశాలపై నివేదిక కోరింది. అలాగే రాష్ట్రపతి పర్యటనల సమయంలో కఠినమైన భద్రత, ప్రోటోకాల్ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించకపోవడం రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన గా పరిగణిస్తారు.
రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం చర్యలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.


