
📌 Key Points
- ఇజ్రాయెల్, అమెరికా దాడులతో టెహరాన్‌లోని మూడు ఆయిల్ డిపోలు ధ్వంసం
- ధ్వంసమైన డిపోలలో చెలరేగిన మంటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- చైనాకు వెళ్లే ఆయిల్‌లో 15% ఈ డిపోల నుంచే సరఫరా అవుతుందని అంతర్జాతీయ మీడియా వెల్లడి
- యుద్ధంలో సహకరించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటన
ఇరాన్ మరియు ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్‌లోని ఆయిల్ డిపోలపై దాడులు జరిగాయి. టెహరాన్‌లోని మూడు ఆయిల్ డిపోలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టెహరాన్‌లో ఆయిల్ డిపోల విధ్వంసం
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ మూడు దేశాల మధ్య వార్ భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో చాలామంది సైనికులు మరణించారు. ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఆయిల్ డిపోలు మొత్తం ధ్వంసం అయ్యాయి.
టెహరాన్ లోని మూడు ఆయిల్ డిపోలపై అమెరికా అలాగే ఇజ్రాయిల్ వరుసగా దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలోని మూడు ఆయిల్ డిపోలు ధ్వంసం అయ్యాయి. డిపోలలో మంటలు చెలరేగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాకు వెళ్లే ఆయిల్ లో 15% ఇక్కడి నుంచే వెళ్తుందని, అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇది ఇరాన్ కు ఊహించని ఎదురు దెబ్బ అంటూ వ్యాఖ్యానించింది. ఇది ఇలా ఉండగా యుద్ధంలో తమకు సహకరించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయిల్ ప్రధాని నెత న్యాహు . తమ విజయం ప్రపంచానికి అను ముప్పును తొలగిస్తుందని పేర్కొన్నారు.
వైరల్ అవుతున్న మంటల వీడియోలు
ఇరాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన ప్రకారం, చాలా దేశాలు తమకు సహకరించడానికి ముందుకు వస్తున్నాయి. వారి విజయం ప్రపంచానికి ముప్పు తొలగిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆసక్తి కలిగిస్తుంది.


