
📌 Key Points
- ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవడం చమురు ధరల తగ్గుదలకు దారితీసింది.
- బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $89.26కు, WTI క్రూడ్ $84.24కు పడిపోయింది.
- యుద్ధం కారణంగా $150కి చేరుతుందని అంచనా వేసిన ధరలు భారీగా తగ్గాయి.
- లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం వరకు జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ తెలిపింది.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
హర్మూజ్ జలసంధి తెరచిన ఇరాన్
ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటన చేసింది. ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు సంబంధించిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి, $89.26 కు చేరుకుంది. అటు అమెరికాకు సంబంధించిన WTI క్రూడ్ 10.45 డాలర్లు తగ్గి..$84.24 కు బ్యారెల్ ధర తగ్గింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి.. $93.46 కు చేరుకుంది. యుద్ధంతో ఓ దశలో 150 డాలర్లకు చేరుతుందని అనుకున్న చమురు ధర ఇప్పుడు అమాంతం తగ్గిపోయింది. దీంతో ప్రపంచానికి భారీ ఊరట లభిస్తుంది.
క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ ఊరట ఇచ్చింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. లెబనాన్ తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీజ్ ఫైర్ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి.
భారీగా పతనమైన చమురు ధరలు
ప్రపంచానికి ఊరట కలిగించిన నిర్ణయం
ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చింది. చమురు ధరలు మరింత తగ్గుతాయా లేదా వేచి చూడాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


