|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యుద్ధం ఆపేది మేమే! అమెరికా, ఇజ్రాయెల్ ఇక తేల్చుకోవాల్సిందే! ఇరాన్ సంచలన ప్రకటన!

Published: 10-03-2026, 6:05 PM
యుద్ధం ఆపేది మేమే! అమెరికా, ఇజ్రాయెల్ ఇక తేల్చుకోవాల్సిందే! ఇరాన్ సంచలన ప్రకటన!
  • ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.
  • చర్చలకు అమెరికా ఆహ్వానించినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు.
  • యుద్ధం తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుల ప్రకటన.
  • టెహ్రాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, భారీ నష్టం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా చర్చలకు ఆహ్వానించినా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ తేల్చి చెప్పింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కొనసాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు పది రోజులుగా ఈ మూడు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. చర్చలకు రావాలని అమెరికా ఆఫర్ ఇచ్చినప్పటికీ, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ మరణం తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది.

వెనక్కి తగ్గని ఇరాన్: సంచలన ప్రకటన

అయితే ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారులు కీలక ప్రకటన చేశారు. యుద్ధం మేము అనుకుంటేనే ఆగుతుందని వెల్లడించాడు. అమెరికా లేదా ఇజ్రాయెల్ అనుకుంటే యుద్ధం ఏ మాత్రం ఆగబోదని.. మేం తలుచుకుంటేనే యుద్ధం ఆగుతుందన్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారులు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టెహ్రాన్ పై దాడులు: పరిస్థితి ఉద్రిక్తం

మంగళవారం రోజున ఇరాన్ లోని టెహ్రాన్ నగరాన్ని టార్గెట్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ భయంకరంగా దాడులు చేస్తున్నాయి. దీంతో చాలా మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ బాంబుల దాడుల త‌రుణంలో మంగ‌ళవారం టీవీ ప్ర‌సారాలు ఆగిపోయిన‌ట్లు స‌మాచారం. ఇక అటు ఈ యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన కూడా చేశారు. మరో నెల రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందని అనుకున్నామ‌న్నారు. కానీ రాబోయే ఐదు రోజుల్లో మాత్రమే యుద్ధం ఫినిష్ చేస్తామని తాజాగా ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్ మూలాలను దెబ్బలు కొట్టామని, ఏ క్షణమైన తమ కాళ్ల దగ్గరికి వస్తుందని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్.

ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం ఈ యుద్ధం మరో ఐదు రోజుల్లో ముగుస్తుందని తెలుస్తోంది. ఇరాన్ కాళ్ళ దగ్గరకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.