
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య 20 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.
- సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇరాన్ దాడి చేసింది.
- రియాద్‌లో జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు, మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
- భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపింది.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. దీనితో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
రియాద్‌లో ఇరాన్ దాడి
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 20 రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా కలిసి పోరాడుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తెలివిగా గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. లేటెస్ట్ గా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో దాడికి పాల్పడింది ఇరాన్. అయితే ఈ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మరో ఇండియన్ మరణించారు. మార్చి 18వ తేదీన సౌదీ అరేబియాలోని రియాద్ లో దాడులకు తెగ బడింది ఇరాన్.
మృతి చెందిన భారతీయుడు
అయితే ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలో ఉన్న భారతీయుడు మృతి చెందారు. ఇప్పటికే ఐదుగురు మరణించగా ఆ సంఖ్య తాజాగా ఆరుకు చేరింది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. మార్చి 18వ తేదీన రియాద్ లో ఓ భారతీయుడు చనిపోయినట్లు తెలిపింది. దీనిపై ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వివరించింది. అటు మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో కాంటాక్ట్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది.
భారత రాయబార కార్యాలయం ప్రకటన
A post shared by The Statesman (@thestatesmanltd)
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, సౌదీ అరేబియాలో ఒక భారతీయుడు మరణించడం విచారకరం. ఈ సంఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది.


