|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్: 90 రోజులు తట్టుకునే సత్తా మాకుంది!

Published: 13-04-2026, 8:35 PM
అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్: 90 రోజులు తట్టుకునే సత్తా మాకుంది!
  • హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని అమెరికా ప్రకటన
  • 90 రోజులు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సమాధానం
  • మూడు నెలల చమురు నిల్వలు ఉన్నాయని ఇరాన్ ప్రకటన
  • మిత్ర దేశాలు తట్టుకుంటాయా అని అమెరికాను ప్రశ్నించిన ఇరాన్

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పింది. మూడు నెలల వరకు చమురు సరఫరా చేయగలమని ధీమా వ్యక్తం చేసింది.

అమెరికా హెచ్చరికలు

ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్న శాంతి చర్చలకు రెండు దేశాలు ఒప్పుకున్నప్పటికీ, స‌ఫ‌లం కాలేదు. ఈ క్రమంలో సవాళ్ళు విసిరికుంటున్నాయి రెండు దేశాలు. లేటెస్ట్ గా హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని తాజాగా అమెరికా ప్రకటించింది. దీనికి ఇరాన్ అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చింది.

హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే తమకు ఇబ్బంది ఏం లేదని వెల్లడించింది. 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. తమ దేశాన్ని దిగ్బంధిస్తామని ట్రంప్ బెదిరించాడని గుర్తు చేసింది. మూడు నెలల పాటు విక్ర‌యించుకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉందని క్లారిటీ ఇచ్చింది ఇరాన్. అయితే మీ మిత్ర దేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకం ఉందా? అంటూ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇరాన్ కౌంటర్ ఎటాక్

చమురు నిల్వలపై ఇరాన్ క్లారిటీ

ఇరాన్ ధీటుగా స్పందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.