
📌 Key Points
- ఇరాన్ చౌకైన డ్రోన్లతో రక్షణ వ్యవస్థలను ఓవర్‌లోడ్ చేస్తోంది.
- చైనా ‘బైడూ’ నావిగేషన్ ద్వారా క్షిపణుల దిశను మారుస్తోంది.
- ఇరాన్ వ్యూహంతో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్నాయి.
- ఇరాన్ ఆయుధ సంఖ్య, సాంకేతికత కలయికతో విరుచుకుపడుతుంది.
పశ్చిమాసియాలో ఇరాన్ వినూత్న సైనిక వ్యూహాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ఇరాన్ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. చైనా సహకారంతో సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది.
ఇరాన్ ‘క్వాంటిటీ గేమ్’ ఏమిటి?
పశ్చిమాసియా రణరంగంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ సైనిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా పేరుగాంచిన అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు ఎలా ఛేదిస్తున్నాయి? దీని వెనుక ఉన్న రహస్యం కేవలం ఆయుధ బలం మాత్రమే కాదు.. అది ‘పరిమాణం’, ‘సాంకేతికత’ల కలయికతో కూడిన ఒక భయంకరమైన వ్యూహం. ప్రధానంగా రెండు అంశాలు ఈ యుద్ధ గమనాన్ని మారుస్తున్నాయి.
ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినా (ఉదాహరణకు అమెరికా ‘పేట్రియాట్’ లేదా ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’) ఒకేసారి పరిమిత సంఖ్యలో వచ్చే ముప్పులను మాత్రమే అడ్డుకోగలదు. ఇరాన్ ఇక్కడ ‘క్వాంటిటీ గేమ్’ ఆడుతున్నది. అంటే ఒకే లక్ష్యంపైకి వందలాది చౌకైన ‘షాహెద్’ డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం. దీనివల్ల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను గుర్తించి కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, వాటి రాడార్లు, కంప్యూటర్లు ‘ఓవర్ లోడ్’ అవుతాయి. అంటే శత్రువు రక్షణ కవచం ఒకేసారి వందల కొద్దీ లక్ష్యాలను చూసి గందరగోళానికి గురవుతుంది. ఈ గ్యాప్‌లోనే ఇరాన్ తన అత్యంత ఖరీదైన బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగిస్తున్నది. వంద డ్రోన్లలో పదిని కూల్చినా, మిగిలినవి రక్షణ కవచానికి చిల్లులు పెట్టి లోపలికి దూసుకుపోతున్నాయి.
చైనా ‘బైడూ’తో క్షిపణుల దిశ మార్పు
బైడూ నావిగేషన్.. చైనా సాయం
అమెరికాకు ఇరాన్ సవాల్ విసురుతుందా?
ఇరాన్ యుద్ధతంత్రంలో మరో ముఖ్యమైన అంశం బైడూ. ఇది చైనాకు చెందిన ‘బైడూ’ నావిగేషన్ వ్యవస్థ. సాధారణంగా మిస్సైల్స్ ఒకసారి ప్రయోగించాక వాటి దారి మార్చడం కష్టం. కానీ బైడూలోని ‘షార్ట్ మెసేజ్ సర్వీస్’ ఫీచర్ ద్వారా ఇరాన్ కమాండర్లు గాలిలో ఉన్న క్షిపణికి దారికి మార్చుకునేలా కొత్త సందేశాలు పంపగలుగుతున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఒక క్షిపణి ఎటు వస్తుందో అంచనా వేసి దాన్ని అడ్డుకోవడానికి తన మిస్సైల్‌ను వదిలినప్పుడు.. ఇరాన్ క్షిపణి బైడూ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్ సిగ్నల్ ద్వారా చివరి క్షణంలో తన రూట్ మార్చుకుంటున్నది. ఫలితంగా అమెరికా రక్షణ క్షిపణులు గాలిలో దారి తప్పుతున్నాయి, ఇరాన్ క్షిపణులు లక్ష్యాన్ని చేరుతున్నాయి. ఇరాన్ తన ఆయుధాల సంఖ్యతో శత్రువును అలిసిపోయేలా చేస్తూనే, చైనా టెక్నాలజీతో అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నది. అమెరికా కేవలం ఫిజికల్ యుద్ధమే కాదు, చైనా అందిస్తున్న ఈ ‘డిజిటల్’ యుద్ధాన్ని కూడా ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పశ్చిమాసియాలో ఆయుధాల హోరు తగ్గేలా లేదు సరే.. కానీ ఈ కొత్త వ్యూహాలు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేలా ఉన్నాయి.
పశ్చిమాసియాలో ఇరాన్ అనుసరిస్తున్న ఈ నూతన విధానం ఆయుధ పోటీని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అమెరికా తన రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.


