
📌 Key Points
- జూన్ 29న వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
- వేసవి సెలవులు, వారాంతపు సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
- సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
- సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ లక్ష్యం.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, జూన్ 29న వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
భక్తుల రద్దీ: టీటీడీ కీలక నిర్ణయం
Tirumala VIP Break Darshan Cancelled : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, దీనికి తోడు శని, ఆదివారాల వారాంతపు సెలవులు రావడంతో తిరుమల గిరులు భక్తజనసందోహంతో పోటెత్తాయి.
ఈ అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు వీలుగా రాబోయే సోమవారం(జూన్ 29) వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
రద్దు అయిన దర్శనాలు: పూర్తి వివరాలు
ఈ నిర్ణయం కారణంగా ఆదివారం రోజు ఎలాంటి వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల మేరకు దర్శన వసతి ఉంటుంది. దీనితో పాటు…. ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో ఏరోజుకారోజు భక్తులకు జారీ చేసే 800 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను సైతం సోమవారం నాడు పూర్తిగా రద్దు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూలైన్లు సైతం పూర్తిగా నిండిపోయి, బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం కావడానికి దాదాపు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత
ఇంకా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీనియర్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ పేర్కొంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణ ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది.


