
📌 Key Points
- విజయ్ కెరీర్‌లో వాయిదా పడిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రికార్డులు అందుకున్నాయి.
- ఉదయ్, ఆతి, కావలన్, తలైవా, పులి వంటి చిత్రాలు వాయిదాల తర్వాత డిజాస్టర్‌గా నిలిచాయి.
- ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యలు, హింసాత్మక సన్నివేశాల కారణంగా వాయిదా పడింది.
- రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు, ఆందోళనలు.
తలపతి విజయ్ కెరీర్‌ను ఓ విచిత్రమైన సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆయన నటించిన కొన్ని సినిమాలు విడుదలకు ముందే వాయిదా పడి, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ కూడా వాయిదా పడటంతో, ఈ సెంటిమెంట్ మళ్లీ నిజమవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వాయిదా పడిన విజయ్ చిత్రాలు: ఫ్లాప్ రికార్డులు
Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు విడుదలకు ముందే వాయిదా పడటం.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోవడం కూడా జరిగింది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటి అంటే విజయ్ కెరీర్ లో వాయిదా పడిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ రికార్డులు అందుకోవడం. దీంతో.. వాయిదా పడిన విజయ్ సినిమాల సెంటిమెంట్.. అనే ఒక చర్చ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.
ముందుగా..2004లో వచ్చిన ఉదయ సినిమా.. విరుదలకు చాలా ఆలస్యం అయింది. విడుదల సమయంలో మంచి అంచనాలు ఉన్నా.. చివరకు అది పోస్ట్ ఫోన్ అయి ఆ తర్వాత విడుదలై..డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2006లో వచ్చిన ఆతి(Aathi).. సినిమా కూడా వాయిదాల తర్వాత థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా అయితే ఏకంగా తమిళ ఇండస్ట్రీ భారీ డిజాస్టర్‌గా.. మారి పెద్ద షాక్ ఇచ్చింది.
2011లో విడుదలైన కావలన్ విషయంలో కూడా జాప్యం జరిగింది. ఎన్నో అడ్డంకుల తర్వాత విడుదలైన ఈ చిత్రం.. కథ, భావోద్వేగాలు బాగున్నాయని చెప్పుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. 2013లో వచ్చిన తలైవా సినిమాకు రాజకీయ కారణాలతో విడుదల ఆలస్యం అయింది. చివరకు సినిమా ఫలితం అభిమానులను నిరాశపరిచింది.
జన నాయగన్ ఆలస్యం: సెంటిమెంట్ భయం
2015లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పులి సినిమా మీద అంచనాలు అప్పట్లో భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. విడుదలైన తర్వాత ఇది ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విజయ్ సినిమాలు వాయిదా పడితే ఫ్లాప్.. అనే సెంటిమెంట్ మరింత బలపడింది.
ఇప్పుడు 2025లో రాబోతున్న జన నాయగన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే సెన్సార్ సమస్యలు.. హింసాత్మక సన్నివేశాలు, కొన్ని డైలాగులు మతపరమైన వివాదాలకు దారితీయవచ్చన్న కారణాలతో.. సెన్సార్ వారు సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనిపై జనవరి 9 ఉదయం హైకోర్టులో ఫైనల్ డెఫిషియన్.
ఈసారి బ్రేక్ అవుతుందా?: అభిమానుల ఆశ
గత అనుభవాల కారణంగా అభిమానుల్లో టెన్షన్ ఉన్నా, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఈసారి సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. జన నాయగన్ విజయ్ కెరీర్‌కు గౌరవప్రదమైన ముగింపు అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
గత అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నా, ‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌కు గౌరవప్రదమైన ముగింపు కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అవుతుందా, విజయ్ చివరి సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.


