
‘దక్ష’ సినిమా తర్వాత నటి మంచు లక్ష్మి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్, సినిమాల్లో మహిళల శరీరాన్ని చూపించడంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. సౌత్, నార్త్ ఇండస్ట్రీల కల్చర్‌లోని తేడాల గురించి కూడా మాట్లాడిన ఆమె కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
Key Points
‘దక్ష’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా అది పెద్దగా విజయం సాధించలేదని లక్ష్మి తెలిపింది.
కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొన్నానని, కుటుంబం వల్ల కొంత రక్షణ లభించిందని చెప్పింది.
సినిమాల్లో బొడ్డు చూపించడం తప్పు కాదని, దాన్ని కళగా చూడాలని పేర్కొంది.
సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో మహిళలపై మానసిక ఒత్తిడి తేడాలపై వ్యాఖ్యానించింది.
మంచు లక్ష్మి రీఎంట్రీ, ఇంటర్వ్యూలు
మంచు లక్ష్మి (manchu laxshmi)చాలా రోజుల తర్వాత ‘దక్ష’ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం పెద్దగా అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తమ కుటుంబ విషయాలను, పర్సనల్ లైఫ్ గురించి రివీల్ చేస్తోంది. తాజాగా, ‘ది మేల్ ఫెమినిస్ట్’(The Male Feminist) పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో యాంకర్ మీరు స్టార్ కిడ్ కాబట్టి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు రాలేదనుకుంటా?అని అడగ్గా.. దానికి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘‘అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. నేను కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. కానీ నా కుటుంబం, నాన్న పేరు కారణంగా కొంతవరకు దూరంగా ఉండేవి అంతే.
కానీ కొన్ని సంఘటనలు నేను విన్నప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. కాస్టింగ్ కౌచ్ గురించి తెలుసుకున్న తర్వాత ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. కొన్ని కథలు నిజంగా హృదయాన్ని పిండేశాయి’’ అని చెప్పుకొచ్చింది. అలాగే సౌత్, నార్త్ ఇండియా ఇండస్ట్రీల్లోని కల్చర్ మధ్య ఉండే తేడాల గురించి.. కొన్ని సినిమాల్లో బొడ్డు చూపిస్తే పెద్ద తప్పు చేసినట్టేనా అది ఒక ఆర్ట్‌లా చూడాలి. లుక్‌ని ఇంకా అద్భుతం చేస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ మన సమాజం మహిళల శరీరాన్ని వేరేలా చూస్తున్నారు. సౌత్‌లో మహిళలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నార్త్‌లో అలా ఉండదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కాస్టింగ్ కౌచ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
బొడ్డు చూపించడం, సినీ కల్చర్‌పై లక్ష్మి అభిప్రాయం
మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధైర్యంగా ఈ విషయాలను బయటపెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు మరిన్ని చర్చలకు దారి తీయడం ఖాయం.


