|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇషితా దత్తా: రెండు నెలల కుమారుడితో ఆస్పత్రిలో చేరిన ఇషితా దత్తా..!

Published: 01-08-2025, 7:14 AM
ఇషితా దత్తా: రెండు నెలల కుమారుడితో ఆస్పత్రిలో చేరిన ఇషితా దత్తా..!

ప్రముఖ బాలీవుడ్ నటి ఇషితా దత్తా తన రెండు నెలల కుమారుడితో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. తన కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Key Points

1

ఇషితా దత్తా తన రెండు నెలల కుమారుడితో ఆసుపత్రిలో చేరింది.

2

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగుందని ఇషితా తెలిపింది.

4

ఇషితా దత్తా 'చాణక్యుడు', 'దృశ్యం 2' వంటి చిత్రాల్లో నటించింది.

ఇషితా దత్తా ఆసుపత్రిలో చేరిక

బాలీవుడ్‌ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్‌ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్‌ నటుడు వత్సల్‌ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.

ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ . ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ ‌ న్యూస్ చెప్పిన ఇషితా జూన్ ‌ లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది .

కుమారుడి ఆరోగ్యం

అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది . తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది . ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది . ఇది నిజంగా కఠినమైన నెల… నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో … ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది .

కాగా .. ఇషిత దత్తా – వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ – బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు ‍ స్వాగతం పలికారు . కాగా .. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం – 2లో కనిపించింది.

ఇషితా దత్తా వృత్తి జీవితం

ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా ‘ఆదిపురుష్’ చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్‌ వంటి చిత్రాల్లో నటించింది.

ఇషితా దత్తా మరియు ఆమె కుమారుడి ఆరోగ్యం బాగుందని తెలుస్తుండడం సంతోషకరమైన విషయం. వారిద్దరికీ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.