
📌 Key Points
- ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబాను చంపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిక.
- ఇజ్రాయెల్ కు ముప్పు కలిగించే వారిని వెంబడిస్తామని ప్రకటన.
- మోజ్తాబా ఖమేనీ ఆచూకీ తమకు తెలియదని తెలిపిన ఇజ్రాయెల్.
- గాయపడిన మోజ్తాబా రష్యాలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు.
ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య మరింత భయాందోళనలు రేకెత్తిస్తోంది.
ఇరాన్ ను హెచ్చరించిన ఇజ్రాయెల్ మిలిటరీ
ఇరాన్ కు మరో వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. యుద్ధం భయంకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని వెతికి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు పంపింది. ఇజ్రాయెల్ కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి తప్పించుకోలేరని, అలాంటి వాళ్లను వెంబడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ మిలిటరీ. వెతికి పట్టుకొని వాళ్లను హతమార్చుతామని పేర్కొంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఏ మూలన దాక్కున్న బయటకు తీసుకువచ్చి చంపేస్తామని తెలిపింది. అయితే మోజ్తాబా ఖమేనీ ఆచూకీ పై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది ఇజ్రాయెల్. కాగా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో గాయపడిన మోజ్తాబా ఖమేనీ రష్యాలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తప్పించుకోలేరన్న ఇజ్రాయెల్
రష్యాలో మోజ్తాబా చికిత్స?
ఇజ్రాయెల్ యొక్క ఈ హెచ్చరికలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


