|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐటెం సాంగ్స్: హీరోయిన్లకు శాపమా? ఇమేజ్ భయంతో స్టార్స్ దూరం!

Published: 23-03-2026, 5:05 AM
ఐటెం సాంగ్స్: హీరోయిన్లకు శాపమా? ఇమేజ్ భయంతో స్టార్స్ దూరం!
  • ఐటెం సాంగ్స్ చేస్తే స్టార్ హీరోయిన్ హోదా పోతుందని భయపడుతున్న నటీమణులు.
  • కాజల్ ఐటెం సాంగ్ చేయడం వల్ల హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయని భావిస్తున్నారు.
  • సమంత ‘ఊ అంటావా’ పాట తర్వాత ఐటెం గర్ల్ ఇమేజ్‌తో ఇబ్బంది పడుతోంది.
  • శ్రీలీల వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌కు దూరం జరుగుతున్నారు.

టాలీవుడ్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌తో కోట్లు సంపాదించిన వారు, ఇప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంతో ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఐటెం సాంగ్స్‌తో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా?

Item Songs: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఒక విచిత్రమైన డైలామాలో పడిపోయారు. ఒకప్పుడు “ఐటెం సాంగ్ చేస్తే ఏముంది? ఒక్క పాటతో కోట్లు వస్తాయి కదా” అని ఎగబడ్డ భామలంతా, ఇప్పుడు అదే ఐటెం సాంగ్ పేరు వింటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. సమంత, శ్రీలీల, పూజా హెగ్డే వంటి అగ్ర నటీమణులు ఇప్పుడు తమ ఇమేజ్ గురించి పడుతున్న టెన్షన్ చూస్తుంటే, అసలు వీరికి హీరోయిన్లుగా భవిష్యత్తు ఉందా? అన్నడౌట్స్ రైజ్ అవుతున్నాయ్ . ఐటెం సాంగ్స్ చేస్తే ‘స్టార్ హీరోయిన్’ హోదా పోయి, కేవలం ‘గ్లామర్ పీస్’లుగా ముద్ర పడిపోతామనే భయం వీరిని నిద్రపోనివ్వడం లేదు మరి.

కెరీర్ క్లోజ్ చేసుకున్న ముద్దుగుమ్మలు

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన చందమామ కాజల్ అగర్వాల్, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్’ అంటూ ఐటెం సాంగ్ చేసింది. ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ, కాజల్‌కు మాత్రం అది శాపంగా మారింది. మిల్కీ బ్యూటీ తమన్నా నటన కంటే డ్యాన్సులకే ఎక్కువ పేరు తెచ్చుకుంది. అయితే వరుసగా ఐటెం సాంగ్స్ (అల్లుడు శీను, స్పీడున్నోడు, తాజాగా జైలర్) చేయడం వల్ల ఆమెపై ‘ఐటెం గర్ల్’ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఇప్పుడు తమన్నాకు హీరోయిన్‌గా పవర్‌ఫుల్ రోల్స్ రావడం గగనమైపోయింది. ఎంతసేపూ బాడీ ఎక్స్‌పోజింగ్, డ్యాన్స్ మూమెంట్స్ ఉంటేనే తమన్నాను పిలుస్తున్నారు తప్ప, ఒక పర్ఫార్మర్ గా ఆమెను ఎవరూ గుర్తించడం లేదు.శృతి హాసన్ కూడా మధ్యలో ‘ఆగడు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి తన హీరోయిన్ ఇమేజ్‌ను రిస్క్‌లో పడేసుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ అవ్వడానికి ఆమె చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తోంది.

కాజల్, తమన్నా వంటి వారి కెరీర్‌పై ప్రభావం

సమంత ‘ఊ అంటావా’.. అది సంచలనమా లేక శాపమా? ఇక  పుష్ప సినిమాలో ‘ఊ అంటావా’ పాటతో సమంత దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. కానీ, ఆ పాట తర్వాత ఆమెకు వచ్చిన ఆఫర్లన్నీ దాదాపు ‘అంగాంగ ప్రదర్శన’కు ప్రాధాన్యత ఉన్నవే కావడం గమనార్హం. ఒకప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లలో నటనతో మెప్పించిన సమంత, ఇప్పుడు కేవలం ‘ఐటెం గర్ల్’ అనే ముద్ర నుండి బయటపడటానికి నానా తంటాలు పడుతోంది. భారీ పారితోషికం ఆఫర్ చేసినా, ఆ ఇమేజ్ తన కెరీర్‌ను నాశనం చేస్తుందని ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు స్పెషల్ సాంగ్స్‌కు ‘రెడ్ కార్డ్’ ఇచ్చేసింది. కేవలం గ్లామర్ మీద ఆధారపడితే కెరీర్ ఎక్కువ కాలం సాగదని, వయసు పెరిగే కొద్దీ ఇలాంటి పాటలే శాపంగా మారుతాయని సమంతకు అర్థమైనట్లు కనిపిస్తోంది.

శ్రీలీల ‘డ్యాన్స్’ ఇమేజ్.. నటనకు సమాధి కడుతోందా? యంగ్ సెన్సేషన్ శ్రీలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెరీర్ మొదట్లోనే ఆమెను కేవలం ‘డ్యాన్సింగ్ మెషిన్’ అని పిలవడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తే, రేపు పొద్దున ఆమెను కేవలం డ్యాన్సులకే పరిమితం చేస్తారనే భయం ఈ అమ్మడిలో స్పష్టంగా కనిపిస్తోంది. పాన్-ఇండియా లెవల్లో హీరోయిన్‌గా ఎదగాలంటే ‘ఐటెం గర్ల్’ ట్యాగ్ పడితే కెరీర్ క్లోజ్ అయినట్టేనని శ్రీలీల జాగ్రత్త పడుతోంది. డ్యాన్స్ తప్ప నటన రాదా? అనే ప్రశ్న రాకుండా ఉండటానికి ఇప్పుడు కోట్లు ఇస్తామన్నా స్పెషల్ సాంగ్స్ వైపు చూడటం లేదు. కేవలం కాళ్ళతో డ్యాన్స్ చేస్తే సరిపోదు, కళ్ళతో నటన కూడా చేయాలని  కోరుకుంటున్నారు ఆడియన్స్.

పూజా హెగ్డే.. ఐటెం సాంగ్స్ చేస్తే ‘సెకండ్ గ్రేడ్’ హీరోయిన్ అవుతుందా? వరుస ప్లాపులతో ఇప్పటికే ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న పూజా హెగ్డేకు, ఇప్పుడు తన హీరోయిన్ హోదా మీద విపరీతమైన ఇన్ సెక్యూరిటీ మొదలైంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో మెరిసినా, ఇప్పుడు మాత్రం కేవలం పవర్‌ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ పాత్రలే కావాలంటూ కండిషన్లు పెడుతోంది. ఐటెం సాంగ్స్ చేయడం వల్ల హీరోయిన్ రేంజ్ తగ్గిపోయి, కేవలం పక్కన ఆడే బొమ్మగా మిగిలిపోతాననే భయం పూజాలో కనిపిస్తోంది. పాన్-ఇండియా మార్కెట్‌లో నిలబడాలంటే పటిష్టమైన ఇమేజ్ కావాలి తప్ప, ఇలాంటి చిల్లర గ్లామర్ షోలు కాదని ఆమె ఫిక్స్ అయిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నా సరే, ఐటెం భామగా మాత్రం పిలిపించుకోవడానికి సిద్ధంగా లేదు.

సమంతకు ఊ అంటావా సాంగ్ ఎలాంటి అనుభవం?

అసలు భయం ‘పాన్-ఇండియా’ ఇమేజ్ డ్యామేజ్ గురించే! అయితే సినిమాల్లో హీరోయిన్ రోల్స్ దక్కపోవడం ఒక కారణమైతే,ఇపుడు దక్షిణాది చిత్రాలు ఇప్పుడు గ్లోబల్ లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ లేదా ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ రావాలంటే ఆ నటి ఇమేజ్ చాలా క్లీన్‌గా ఉండాలి. ఐటెం సాంగ్స్ చేసిన నటీమణులను కేవలం గ్లామర్ డాల్స్‌గా మాత్రమే చూస్తారు తప్ప, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి దర్శకులు డేర్ చేయరు. అందుకే, లాంగ్ రన్‌లో కెరీర్ నిలబడాలంటే తాత్కాలికంగా వచ్చే కోట్ల రూపాయల కంటే, హీరోయిన్‌గా నిలబడటమే గొప్ప అని ఈ ముద్దుగుమ్మలు రియలైజ్ అయినట్టున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే, ఐటెం సాంగ్స్ అనేవి హీరోయిన్ల కెరీర్‌కు ‘స్లో పాయిజన్’ లాంటివని వీరు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్న మాట .

మొత్తానికి, గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రల ద్వారానే ఎక్కువ కాలం కెరీర్ కొనసాగుతుందని హీరోయిన్లు భావిస్తున్నారు. అందుకే ఐటెం సాంగ్స్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.