|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింపుల్ లుక్‌లో ఇవానా.. అచ్చ తెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్

Published: 13-08-2025, 5:17 AM
సింపుల్ లుక్‌లో ఇవానా.. అచ్చ తెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్

‘లవ్ టుడే’ సినిమాతో పాపులర్ అయిన ఇవానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కలంకారీ బ్లౌజ్ మరియు ఖాదీ శారీలో ఆమె సింపుల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

Key Points

1

ఇవానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసింది.

2

కలంకారీ బ్లౌజ్ మరియు ఖాదీ కాటన్ శారీలో సింపుల్ లుక్‌లో కనిపించింది.

4

‘లవ్ టుడే’ మరియు ‘సింగిల్’ సినిమాలతో పాపులారిటీ సంపాదించింది.

ఇవానా యొక్క ట్రెడిషనల్ లుక్

‘లవ్ టుడే’(Love Today) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ హీరోయిన్ ఇవానా(Ivana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో చెప్పే ‘చెప్పు బుజ్జి కన్నా’ డైలాగ్ కుర్రకారును కట్టిపడేసింది. దీంతో ఈ భామకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా రీసెంట్‌గా శ్రీ విష్ణు(Sri Vishnu) నటించిన ‘సింగిల్’(Single) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో కొన్ని సినిమాలతో బిజీ హీరోయిన్‌గా రాణిస్తోంది.

నెటిజన్ల నుండి ప్రశంసలు

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో కలంకారీ బ్లౌజ్ అండ్ ఖాదీ కాటన్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని చాలా సింపుల్ లుక్‌లో కనిపిచింది. అలాగే తన వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతంఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు తెలుగింటి కోడలిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవానా సినిమా ప్రస్తావన

A post shared by Ivana (@i__ivana_)

ఇవానా యొక్క సింపుల్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.