
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వర్ష, ప్రస్తుతం తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో అలరిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
జబర్దస్త్ వర్ష సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో అలరిస్తోంది.
పట్టు లంగా జాకెట్‌లో ఆమె అందాలను ప్రదర్శించే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
వర్ష జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకుని, చాలా టీవీ షోలలో నటించింది.
నెటిజన్లు ఆమె ఫోటోలను 'ఒక్కో ఫోటో ఒక్కో డైమండ్' అంటూ ప్రశంసిస్తున్నారు.
జబర్దస్త్ వర్ష గ్లామర్ షో
దిశ, వెబ్ డెస్క్: వర్ష ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ జబర్దస్త్ వర్ష అంటే గుర్తుపట్టనివారు ఉండరేమో. కామెడీ షో జబర్దస్త్‌లో ఈ బ్యూటీ చేసిన రచ్చ అలాంటిది. ఇమ్మాన్యూయేల్‌తో కలిసి వర్ష చేసే కామెడీ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. అప్పట్లో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే పుకార్ కూడా వచ్చింది. ఆ తరవాత షో కోసమే చేశామంటూ బ్యూటీ క్లారిటీ కూడా ఇచ్చేసింది. జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వర్ష కేవలం ఆ షోకు మాత్రమే పరిమితం కాకుండా ఆ తరవాత చాలా టీవీ షోలలో సందడి చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ తగ్గలేదు. దానికి కారణం వర్ష ఫాలోవర్స్‌కు ఇచ్చే గ్లామర్ ట్రీటే అని చెప్పాలి. తరచూ జబర్దస్త్‌లో పొట్టి బట్టలతో సందడి చేసే వర్ష సోషల్ మీడియాలోనూ అలాంటి దుస్తులతోనే ఫోటోలకు పోజులు ఇస్తుంది. కేవలం వెస్ట్రన్ మాత్రమే కాకుండా ట్రెడిషనల్‌లోనూ వర్ష అందాల ఆరబోత మామూలుగా ఉండదు.
నెటిజన్ల ప్రతిస్పందన
ఈ బ్యూటీ ఫోటో అప్లోడ్ చేసిందంటే మినిమమ్ గ్లామర్ షో పక్కాగా ఉంటుంది. దీంతో వర్ష ఫ్యాన్స్ అంతా కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. ఇక తాజాగా బ్యూటీ మరోసారి ఫాలోవర్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పట్టు లంగా జాకెట్‌లో భారీ అందాలు చూపిస్తూ పోజులు కొట్టింది. ఇక ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఒక్కో ఫోటో ఒక్కో డైమండ్‌లా ఉందంటున్నారు.
వర్ష తన అందాలతో అభిమానులను మెప్పిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ అద్భుతం. తన గ్లామర్‌తో అలరించడం ఆమెకు బాగానే సాగుతుంది.


