|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జబర్దస్త్ నరేష్ షాకింగ్ రెమ్యునరేషన్: నెలకి ఎంత సంపాదిస్తాడో తెలిస్తే మైండ్ బ్లాంక్!

Published: 01-03-2026, 10:05 PM
జబర్దస్త్ నరేష్ షాకింగ్ రెమ్యునరేషన్: నెలకి ఎంత సంపాదిస్తాడో తెలిస్తే మైండ్ బ్లాంక్!
  • జబర్దస్త్ నరేష్: ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలకు పైగా పారితోషికం!
  • నెలకు రూ. 8-10 లక్షలు సంపాదన, శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ సందడి!
  • ప్రైవేట్ ఈవెంట్లకు రూ. 50 వేలు, నెలకు అదనంగా రూ. 5 లక్షల ఆదాయం!
  • బుల్లెట్ భాస్కర్ ప్రోత్సాహంతో జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన నరేష్!

జబర్దస్త్ నరేష్ గురించి ఒక సంచలన వార్త! తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్విస్తూ, భారీగా సంపాదిస్తున్నాడు. ఆయన పారితోషికం వివరాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

జబర్దస్త్‌లో నరేష్ పారితోషికం?

జబర్దస్త్ నరేష్‌ గత కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో నవ్విస్తున్నాడు. చూడ్డానికి చిన్నవాడే అయినా కామెడీ చేయడంలో దిట్ట. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అలరిస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షోకి మంచి అసెట్‌గా మారాడు. ఎంతో మంది కమెడియన్లు జబర్దస్త్ ని వీడినా, తను మాత్రం దాన్ని నమ్ముకొనే ఉన్నాడు. అదే సమయంలో ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా అందరి వాడు అనిపించుకున్నాడు.

నరేష్‌ ఏజ్‌ దాదాపు 30ఏళ్లు ఉంటుంది. జన్యూ పరంగా ఉన్న లోపం వల్ల ఆయన హైట్‌ పెరగలేదు. దీంతో చిన్నపిల్లవాడిగానే ఉంటాడు. కానీ తన లోపాన్ని పాజిటివ్‌గా మార్చుకుని కామెడీ చేస్తూ ఆకట్టుకున్నాడు. తన హైట్‌పై కూడా జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. తను చిన్నగా ఉన్నానని బాధపడకుండా దాన్నే ఆయుధంగా మార్చుకుని వెళ్తున్నాడు.

ఈవెంట్స్‌తో లక్షల్లో ఆదాయం!

జబర్దస్త్ నరేష్‌.. ఈ కామెడీ షో చేయడానికి, ఆయన ఈవెంట్లు చేయడానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది చూస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నరేష్‌ జబర్దస్త్ షోకి బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్‌తో పరిచయం అయ్యాడు. భాస్కర్‌ అతన్ని బాగా ఎంకరేజ్‌ చేశారు. నెమ్మదిగా పాపులర్‌ అయ్యాడు నరేష్‌. తన హైటే ఆయన్ని షోలో ప్రత్యేకంగా నిలిపింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో జబర్దస్త్‌ నరేష్‌ ఒక్కో ఎపిసోడ్‌కి లక్ష రూపాయల వరకు పారితోషికం తీసుకునేవాడట. ఇప్పుడు టీమ్‌ లీడర్‌ అయ్యాక అది కాస్త రెండు లక్షలకుపైగానే(2-2.5లక్షలు) అయ్యిందని సమాచారం. వారంలో నాలుగు జబర్దస్త్ ఎపిసోడ్లు చేస్తారు. దీంతో నరేష్‌ నెలకు సుమారుగా రూ.8-10లక్షలకుపైగానే సంపాదిస్తున్నాడని చెప్పొచ్చు.

ఇక జబర్దస్త్ తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపిస్తున్నాడు నరేష్‌. దానికి కాస్త తక్కువగానే ఉంటుందని లక్ష వరకు పారితోషికం ఇస్తారని సమాచారం. అయితే మల్లెమాలలో పారితోషికాలు చాలా సిస్టమాటిక్‌గా ఉంటాయి. అయినా అక్కడ పేరు కోసం పనిచేస్తుంటారు కమెడియన్లు. మరోవైపు ఈవెంట్‌ పారితోషికం వెల్లడించారు నరేష్‌. ఇటీవల జబర్దస్త్ వర్షకి ఇచ్చిన `కిస్సిక్‌` ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం వివరాలు తెలిపారు. ఒక్కో ఈవెంట్‌కి రూ.50వేల వరకు తీసుకుంటాడట. ఇలా నెలకు పది ఈవెంట్లు చేసిన ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు.

నరేష్ సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

మొత్తంగా జబర్దస్త్ నరేష్‌ నెల సంపాదన.. జబర్దస్త్ కామెడీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, ప్రైవేట్‌ ఈవెంట్లు, స్పెషల్‌ షోస్‌, స్పెషల్‌ ఎపిసోడ్లు, ఓపెనింగ్స్ ఇలా అన్నీ కలుపుకొని నెలకు 25-30 లక్షలు ఉంటుందని సమాచారం. ఇది మినిమమ్‌గా చెప్పొచ్చు. నరేష్‌ చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ప్రధానంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్‌ చేశాడు. ఇప్పుడు అప్పులన్నీ తీర్చుకుని బాగానే సంపాదిస్తున్నాడు. బాగా సెటిల్ అయినట్టు సమాచారం.

జబర్దస్త్ నరేష్ సంపాదన వివరాలు చూశారుగా. తన టాలెంట్ తో ఎదిగిన నరేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.