|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రబాబుది రైతు ద్రోహం! జగన్ సంచలన ఆరోపణలు: హామీలన్నీ బూటకమేనా?

Published: 21-06-2026, 11:50 PM
చంద్రబాబుది రైతు ద్రోహం! జగన్ సంచలన ఆరోపణలు: హామీలన్నీ బూటకమేనా?
  • చంద్రబాబుకు రైతులపై ప్రేమ బూటకమని, హామీలను నిలబెట్టుకోలేదని జగన్ ఆరోపణ.
  • వైఎస్సార్‌సీపీ హయాంలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు నిరంతర రైతు భరోసా.
  • కూటమి ప్రభుత్వం 7 లక్షల మంది రైతులను పథకాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించింది.
  • ప్రస్తుత ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవని జగన్ విమర్శ.

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన హామీలు మోసపూరితమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను గణాంకాలతో వివరించారు.

చంద్రబాబు హామీలు – జగన్ విమర్శలు

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన హయాంలో సాగు రంగానికి మోసం మాత్రమే మిగిలిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతోనే కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ చంద్రబాబు రైతాంగాన్ని వంచించారని ఆరోపించార మోసం చేయడంలో తన పాత రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటున్నారని జగన్ విమర్శించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తూ వైఎస్ జగన్ పలు గణాంకాలను విడుదల చేశారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు తమ ప్రభుత్వం 53.58 లక్షల రైతు కుటుంబాలకు ఎలాంటి అంతరాయం లేకుండా, క్రమం తప్పకుండా ‘రైతు భరోసా’ పెట్టుబడి సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఒక్క ఏడాది కూడా రైతులకు ఇచ్చే సాయాన్ని ఆపలేదని…. పైగా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం- కిసాన్ (PM-KISAN) పథకానికి అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని చంద్రబాబు ఘనంగా ప్రకటించారని జగన్ గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి…. ఇప్పుడు మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి వాగ్దానం చేసిన రూ.60,000 పెట్టుబడి సాయానికి గానూ దక్కింది కేవలం రూ.19,000 మాత్రమేనని జగన్ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ vs కూటమి: రైతు సంక్షేమం

చంద్రబాబు ప్రభుత్వం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ ఏకంగా 7 లక్షల మంది రైతులకు పథకం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించిందని జగన్ ఆరోపించారు. “మా హయాంలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, చంద్రబాబు దాన్ని 46.85 లక్షల మందికే పరిమితం చేశారు. ఇటు కౌలు రైతులకు, అటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (ROFR) పట్టాలు కలిగిన గిరిజన రైతులకు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా మొండిచేయి చూపించింది,” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని జగన్ విమర్శించారు. తాము ఐదేళ్ల పాలనలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు. కానీ ప్రస్తుత రెండేళ్ల చంద్రబాబు పాలనలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి వంటి అన్ని రకాల పంటల ధరలు దారుణంగా పడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం ప్రకటించిన పొగాకు సరాసరి ధర కిలోకు రూ.200 కాగా….. మరుసటి రోజే అది రూ.182కు పడిపోయిందని, రైతులు ట్రాక్టర్లతో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

గతంలో రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా తామే రూ.7,802 కోట్లు పంటల బీమా కింద చెల్లించామని జగన్ పేర్కొన్నారు. అయితే చంద్రబాబు రాగానే ఉచిత పంటల బీమాను రద్దు చేసి, ఆ భారాన్ని రైతులపై వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి ప్రీమియం కట్టినా, ప్రభుత్వం తన వంతు వాటాను చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్ రాక రైతాంగం నష్టపోతోందన్నారు.

7 లక్షల మంది రైతుల తొలగింపుపై జగన్ ఆగ్రహం

ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నట్టేట ముంచిందని జగన్ విమర్శించారు. అప్సడా (APSADA) అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్‌పై రూ.4, జూన్‌లో మరో రూ.10 నుండి రూ.12 వరకు పెంచుకుంటూ పోయారన్నారు. దీనివల్ల టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి ఏకంగా రూ.1.08 లక్షలకు చేరిందని, అదే సమయంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంగా కిలోకు రూ.4 తగ్గిస్తామని ప్రకటించి, తీరా రూ.2 మాత్రమే తగ్గించి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తంగా, చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, సంక్షేమ పథకాలను కుదించిందని జగన్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.