|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బుల్లితెరపై మరో సెలబ్రిటీ టాక్ షో.. హోస్ట్‌గా మారిన నటుడు జగపతి బాబు.. మొదటి గెస్టుగా కింగ్ నాగార్జున.. ఓటీటీలో కూడా!

Published: 14-08-2025, 3:15 AM
బుల్లితెరపై మరో సెలబ్రిటీ టాక్ షో.. హోస్ట్‌గా మారిన నటుడు జగపతి బాబు.. మొదటి గెస్టుగా కింగ్ నాగార్జున.. ఓటీటీలో కూడా!

ప్రముఖ నటుడు జగపతి బాబు తన మొదటి టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి ఎపిసోడ్‌కు అతిథిగా హాజరవుతున్నారు.

Key Points

1

జగపతి బాబు హోస్ట్‌గా నటించే కొత్త టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి'

2

మొదటి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా నాగార్జున

4

ఆగస్టు 15న జీ5 ఓటీటీలో ప్రసారం

జగపతి బాబు కొత్త టాక్ షో

నిరంతరం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది.

వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుంది. టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొదటి అతిథిగా జయమ్ము నిశ్చయమ్మురా విత్​ జగపతి ప్రారంభం కానుంది. ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం జీ తెలుగు లో ప్రసారం కానుంది.

బుల్లితెరపై మొదటిసారిగా నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా విత్​ జగపతి కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారి తనదైన స్టైల్​, కామెడీ టైమింగ్‌​తో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. తెలుగు సినిమాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్న జగపతి బాబు జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించేందుకు వచ్చేస్తున్నారు.

నాగార్జున మొదటి అతిథి

ఘనంగా ప్రారంభం కానున్న జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి లాంచ్​ ఎపిసోడ్‌​కి టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొదటి అతిథిగా రానున్నారు. ఈ గ్రాండ్​ లాంచ్​ ఎపిసోడ్‌​లో నాగార్జున తన కెరీర్​, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంగతులతోపాటు సూపర్​ హిట్​ సినిమాల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌తో తన అనుబంధం వరకు మరెన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు.

అంతేకాకుండా, ఈ ఎపిసోడ్‌లో అక్కినేని కుటుంబం ప్రముఖ వ్యక్తులు ముఖ్య​అతిథులుగా హాజరై నాగార్జున గురించి మరిన్ని సంగతులను చెప్పడమే కాదు, భావోద్వేగంతో కూడిన మరపురాని క్షణాలను ఆస్వాదించనున్నారు.

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు, తమ నటనతో తెరపై ప్రేక్షకులకు వినోదం పంచే సినీ ప్రముఖుల జీవితాల్లోని ఒడిదొడుకులు, ఆనందాలు, కష్టసుఖాలు, జ్ఞాపకాలను పంచుకునే స్ఫూర్తిదాయకమైన వేదిక అని మేకర్స్ చెబుతున్నారు.

జీ తెలుగు మరియు జీ5లో ప్రసారం

ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి అంటూ గెస్ట్‌లతో కలిసి జగపతి బాబు పంచే వినోదాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి అని జీ తెలుగు ప్రకటించింది. అయితే, టీవీ కంటే ముందు ఓటీటీ లో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి స్ట్రీమింగ్ కానుంది.

ఆగస్ట్ 15న జీ5లో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి ఓటీటీ రిలీజ్ కానుంది. అటు జీ తెలుగు, ఇటు జీ5 లలో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి ప్రసారం కానుంది.

జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరించే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో జీ తెలుగు మరియు జీ5 లో ప్రసారం కానుంది. నాగార్జునతో ప్రారంభమయ్యే ఈ షో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.