|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జగపతి బాబును గుర్తుపట్టలేకపోయిన జనం! ‘పెద్ది’ గెటప్‌లో ఆయన చేసిన సాహసం!

Published: 03-06-2026, 3:46 PM
జగపతి బాబును గుర్తుపట్టలేకపోయిన జనం! 'పెద్ది' గెటప్‌లో ఆయన చేసిన సాహసం!
  • జగపతి బాబు ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించనున్నారు.
  • హైదరాబాద్ రోడ్లపై ‘అప్పలసూరి’ గెటప్‌లో తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు.
  • డీగ్లామరైజ్డ్ లుక్‌లో, పంచెకట్టుతో సాధారణ వ్యక్తిలా కనిపించారు.
  • ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ, నటనపై ఆయన అంకితభావాన్ని చాటుతోంది.

నటుడు జగపతి బాబు ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’ పాత్ర కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఆయన ఈ గెటప్‌లో హైదరాబాద్ రోడ్లపై తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. క్యారెక్టర్ పట్ల ఆయనకున్న అంకితభావం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అప్పలసూరిగా జగపతి బాబు అద్భుత ట్రాన్స్‌ఫర్మేషన్

Appalasuri Transformation: జగపతి బాబు.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టే నటుల్లో  ఒకరు. లెక్కల మాష్టారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ప్రెసిడెంట్ ఫణిహారం పాత్రతో విలన్‌గా సరికొత్త సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు జగ్గూభాయ్.ఇపుడు అదే సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో ఆయన కనిపించబోతున్నారు. తాజాగా ఈ క్యారెక్టర్ గెటప్‌లో ఆయన ఏకంగా హైదరాబాద్ రోడ్లపై సాధారణ ప్రజల మధ్య తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేకపోయారనే షాకింగ్ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో

Appalasoori road na padina kooda yevaru gurthupattaledhu. #Peddi pic.twitter.com/eEDp94SUsO

ప్రజల మధ్య తిరిగినా గుర్తుపట్టని జనం

— Jaggu Bhai (@IamJagguBhai) June 3, 2026

జగపతి బాబు తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన బట్టతల క్యాప్, ప్రోస్తెటిక్స్ మేకప్, తెల్లటి గడ్డంతో పూర్తి డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించారు. పంచె కట్టుకుని, పక్కా లోకల్ అప్పలసూరి అవతారంలో నగర రహదారులపై సాధారణ వ్యక్తిలా నడుచుకుంటూ వెళ్లారు. పక్కనే వందలాది మంది జనాలు, భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ, కళ్లముందున్నది ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంతలా ఆయన ఆ పాత్రలో లీనం అయిపోయారు. గతంలో బుచ్చిబాబు మొదటి చిత్రం ‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి పోషించిన రాయనం పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ కానీ గుర్తున్న ప్రేక్షకులకు, ఇప్పుడు జగ్గూభాయ్ ట్రాన్స్‌ఫార్మేషన్ మరో లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. ప్రస్తుతం ఈ మైండ్ బ్లోయింగ్ వీడియోపై అభిమానులు, సినీ పండితులు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నటుడిగా నాకు ఎంతో సంతోషాన్నిఇచ్చిందన్న జగ్గు

నెట్టింట వైరల్ అవుతున్న ‘పెద్ది’ వీడియో

ఇది కేవలం నటన కాదు, సినిమాపై ఆయనకున్న తపస్సు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉత్తర ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో అప్పలసూరి క్యారెక్టర్ థియేటర్లలో ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించబోతుందో ఈ వీడియోతో అర్థమవుతోందని  అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్.ఈ క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌పై జగపతి బాబు స్పందిస్తూ, పాత్రలో పూర్తిగా మునిగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగం చేశానని, ప్రజల మధ్య అంతసేపు తిరిగినా నన్ను ఎవరూ గుర్తుపట్టకపోవడం ఒక నటుడిగా నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘పెద్ది’ చిత్రానికి ఇచ్చిన ఈ డెడికేషన్ ఒకరకంగా  సినిమా రేంజ్‌ను మార్చేసిందనే చెప్పాలి . రేపు (జూన్ 4, 2026) రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్రలో చూపిన అంకితభావం, ఆయన నటన పట్ల ఉన్న తపస్సును స్పష్టం చేస్తుంది. ‘పెద్ది’ సినిమాపై అంచనాలను ఈ సంఘటన మరింత పెంచింది. ఈ పాత్ర థియేటర్లలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.