|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుర్తుపట్టలేనంతగా మారిన జగపతి బాబు.. రామ్ చరణ్ ‘పెద్ది’లో అప్పలసూరి లుక్ సంచలనం!

Published: 29-12-2025, 8:21 AM
గుర్తుపట్టలేనంతగా మారిన జగపతి బాబు.. రామ్ చరణ్ 'పెద్ది'లో అప్పలసూరి లుక్ సంచలనం!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుండి జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్.
  • పోస్టర్‌లో జగపతి బాబును అస్సలు గుర్తుపట్టలేక షాక్ తిన్న ఫ్యాన్స్.
  • ‘అప్పలసూరి’ పాత్రలో జగపతి బాబు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుందని టీమ్ వెల్లడి.
  • ‘పెద్ది’ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 27, 2026న విడుదల కానుంది.

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నుండి జగపతి బాబు ‘అప్పలసూరి’ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో జగపతి బాబును చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయనను అస్సలు గుర్తుపట్టలేనంతగా మేక్ఓవర్ చేశారు. మార్చి 27, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

జగపతి బాబును చూసి షాక్ తిన్న ఫ్యాన్స్

రామ్ చరణ్ పెద్ది నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. అయితే ఇందులో ఆ నటుడిని చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన అతన్ని చూసి ఎవరా అని అనుకున్నారు. మీరు గుర్తు పట్టగలరేమో చూడండి.

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి అప్పలసూరి అనే పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇందులో ఉన్నది జగపతి బాబు అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.

పెద్దిలో అప్పలసూరిగా జగపతి బాబు

పెద్దిలో అప్పలసూరిగా జగపతి బాబు

“ పెద్ది లో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో పెద్ది అధికారిక ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేసింది.

మార్చి 27, 2026న ‘పెద్ది’ రిలీజ్

అటు రామ్ చరణ్ కూడా ఈ పోస్టర్ ను తన అకౌంట్లో షేర్ చేశాడు. “స్క్రీన్ కు అతడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్లా సాధ్యం కాదు. జగపతి బాబు గారిని పెద్దిలో అప్పలసూరిగా చూడటం చాలా సంతోషంగా ఉంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు.

మ్యూజిక్ తోపాటు చరణ్ స్టెప్పులు బాగా ఆకర్షించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. టీమ్ మాత్రం పదే పదే రిలీజ్ డేట్ అంటూ స్పష్టత ఇస్తూనే ఉంది. తాజాగా జగపతి బాబు లుక్ రిలీజ్ చేస్తూ కూడా మరోసారి డేట్ కన్ఫమ్ చేసింది.

రామ్ చరణ్ స్వయంగా జగపతి బాబు పర్ఫార్మెన్స్‌ను కొనియాడారు. ‘పెద్ది’ టీమ్ రిలీజ్ డేట్ మార్చి 27, 2026 అని పదే పదే స్పష్టం చేస్తోంది. అప్పలసూరి పాత్రతో జగపతి బాబు మరోసారి తన నటనతో అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.