|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెన్సేషనల్: అంజనాద్రిలో ‘జై హనుమాన్’ మూవీ స్టార్ట్! రిషబ్ శెట్టి లుక్ వైరల్!!

Published: 22-02-2026, 12:05 PM
సెన్సేషనల్: అంజనాద్రిలో 'జై హనుమాన్' మూవీ స్టార్ట్! రిషబ్ శెట్టి లుక్ వైరల్!!
  • హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రిలో ‘జై హనుమాన్’ మూవీ అట్టహాసంగా ప్రారంభం!
  • రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్నారు.
  • భూషణ్ కుమార్ క్లాప్‌బోర్డ్, అనిల్ థడాని కెమెరా రోల్, తేజ సజ్జా గౌరవ దర్శకత్వం వహించారు.
  • పాన్-ఇండియన్ స్థాయిలో ‘జై హనుమాన్’ చిత్రం సంచలనం సృష్టించడానికి సిద్ధం!

టాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్! ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ చిత్రం అంజనాద్రిలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా కనిపించనున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంజనాద్రిలో ఘనంగా ప్రారంభోత్సవం

ట్రూ పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు దాని ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో నెక్స్ట్ చాప్టర్. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా నటిస్తున్నాడు. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ చిత్రాన్ని ఈ రోజు విజయనగరంలోని హంపిలోని అంజనాద్రి బెట్టలో ఘనంగా ప్రారంభించారు. ఈ పవిత్ర స్థలం హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించబడుతుంది. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, అనిల్ థడాని ఫస్ట్ షాట్‌కు కెమెరా రోల్ చేశారు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తానికి నటుడు రిషబ్‌షెట్టి, నిర్మాత భూషణ్ కుమార్, మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టి-సిరీస్ శివ్ చనానతో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ క్రార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా అదరగొట్టేందుకు రెడీ!

భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం

ప్రస్తుతం ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జై హనుమాన్’ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.