|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ షాక్: జైలర్ 2లో బాలయ్య స్థానంలో ఆ పాన్ ఇండియా స్టార్! నెల్సన్ సంచలన నిర్ణయం

Published: 25-12-2025, 8:53 AM
బిగ్ షాక్: జైలర్ 2లో బాలయ్య స్థానంలో ఆ పాన్ ఇండియా స్టార్! నెల్సన్ సంచలన నిర్ణయం
  • రజినీకాంత్ ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
  • దర్శకుడు నెల్సన్ ‘జైలర్ 2’ కోసం రెండు ప్రత్యేక పాత్రలను పరిచయం చేయాలని ప్రణాళిక చేస్తున్నారు.
  • జైలర్ 2లో బాలకృష్ణ పాత్ర నుండి తప్పించి, ఆయన స్థానంలో పాన్ ఇండియా స్టార్ షారుఖ్ ఖాన్ ను తీసుకున్నట్లు వార్తలు.
  • షారుఖ్ ఖాన్ తో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ వస్తుందని నెల్సన్ భావిస్తున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు రాగా, తాజాగా దర్శకుడు నెల్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాలయ్య స్థానంలో పాన్ ఇండియా స్టార్ షారుఖ్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

జైలర్ విజయ రహస్యం

Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే జైలర్ అనే చెప్పాలి. వయసుకు తగ్గ పాత్ర, ఆ పాత్రలో హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ వెరసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. దర్శకుడు నెల్సన్ రజినీకాంత్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతారు అని తెలుసుకొని అలానే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. దీంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ.700 కోట్ల కలక్షన్స్ రాబట్టి రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, జైలర్ సినిమాలో రెండు స్పెషన్ క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేశాడు నెల్సన్.

Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్ లో నాగ చైతన్య భార్య.. శోభితా హాట్ లుక్స్

జైలర్ 2లో బాలయ్య ప్లేస్ ఎవరికి?

వారిలో ఒకరు మోహన్ లాల్ కాగా, మరొకరు శివరాజ్ కుమార్. సినిమా క్లైమాక్స్ లో ఈ రెండు పాత్రల ఎంట్రీ అద్భుతంగా సెట్ అయ్యింది. అయితే, జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2(Jailer 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, జైలర్ లో మాదిరిగానే జైలర్ 2 సినిమాలో కూడా రెండు స్పెషల్ పాత్రలను ఇంట్రడ్యూస్ చేయనున్నాడట దర్శకుడు. వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ ఉంటారు అని చాలా కాలంగా న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.

నెల్సన్ ప్లాన్ లో షారుఖ్ ఎందుకు?

అయితే, తాజాగా సమాచారం మేరకు ఈ రోల్ నుంచి బాలకృష్ణను తప్పించాడట దర్శకుడు. ఆయన స్థానంలో పాన్ ఇండియా స్టార్ షారుఖ్ ఖాన్ ను తీసుకుంటున్నాడట. షారుక్ అయితే పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న పర్సనల్ కాబట్టి ఆయనైతే సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాడట దర్శకుడు నెల్సన్. అయితే, ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రెండో పాత్రలో ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

జైలర్ 2 ప్రాజెక్టుపై ఈ కొత్త వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. షారుఖ్ ఖాన్ ఎంట్రీతో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ మార్పుపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.