|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జైలర్ 2’లో షారుక్ ఖాన్ సంచలనం! రజనీకాంత్‌తో కలిసి బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధం!

Published: 01-02-2026, 10:05 PM
‘జైలర్ 2’లో షారుక్ ఖాన్ సంచలనం! రజనీకాంత్‌తో కలిసి బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధం!
  • ‘జైలర్ 2’లో షారుక్ ఖాన్ కామియో రోల్ చేయనున్నారు.
  • షారుక్ పాత్ర రజనీకాంత్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే స్నేహితుడిగా ఉండనుంది.
  • దాదాపు 30 ఏళ్ల తర్వాత రజనీ, మిథున్ చక్రవర్తి కలిసి నటిస్తున్నారు.
  • మొదటి భాగంలాగే ఈ సీక్వెల్‌లో కూడా భారీ తారాగణం ఉండనుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

‘జైలర్ 2’లో షారుక్ ఖాన్ ఎంట్రీ

Jailer 2: సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రధాన పాత్రలో నల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్ 2’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన ‘జైలర్ 2’ సినిమాలో కామియో రోల్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘జైలర్’ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.

Read also- Telugu TV Serials: ఆ రెండే టాప్ రేటింగ్.. టాప్ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే..

రజనీకాంత్‌కు అండగా షారుక్ పవర్ ఫుల్ రోల్

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారట. రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలిచే ఒక నమ్మకమైన స్నేహితుడిగా (Confidante) షారుక్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మిథున్ చక్రవర్తి, రజనీ కాంబినేషన్ సెట్ అవ్వగా, ఇప్పుడు షారుక్ కూడా తోడవడంతో సినిమా రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది. మొదటి భాగం ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ మెరిసినట్లే, సీక్వెల్‌లో కూడా నెల్సన్ భారీ ప్లాన్ చేశారు. రమ్యకృష్ణ, యోగి బాబు, సునీల్ మళ్లీ తమ పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, మల్టి టాలెంటెడ్ నటుడు ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్‌తో పాటు విజయ్ సేతుపతి, మోహన్ లాల్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read also- Anil Ravipudi: సంక్రాంతి బరిలోనే అనిల్ రావిపూడి సినిమా .. రంగంలోకి బడా బ్యానర్లు!

పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు

‘జైలర్’ మొదటి పార్ట్ విజయానికి అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రధాన కారణం. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కూడా అనిరుధ్ అద్భుతమైన ట్యూన్స్‌ సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా రజనీ-షారుక్ కలిసి ఉండే సీన్స్‌కు ఇచ్చే మ్యూజిక్ థియేటర్లను హోరెత్తించడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చైన్నై, కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ జూన్ 12, 2026న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షారుక్ ఖాన్ ఎంట్రీతో ‘జైలర్ 2’ పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. రజనీకాంత్, షారుక్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.