
📌 Key Points
- అవతార్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, జేమ్స్ కామెరూన్ వీడియో ఇంటర్వ్యూ.
- కామెరూన్ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
- పులులతో సీన్లుంటే వారణాసి సెట్‌కి వస్తానని జేమ్స్ కామెరూన్ సరదాగా షరతు పెట్టారు.
- రాజమౌళి అవతార్ లోని క్లిష్టమైన పాత్రల క్రియేషన్ గురించి కామెరూన్‌ని ప్రశ్నించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, టాలీవుడ్ సంచలనం రాజమౌళిల మధ్య జరిగిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవతార్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈ సంభాషణలో కామెరూన్ రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమా గురించి ఆసక్తిగా ప్రశ్నించారు.
జేమ్స్ కామెరూన్ ఆసక్తికర ప్రశ్నలు
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించే చిత్రాలకు ఇండియాలో కూడా విశేష ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇటీవల అవతార్ ప్రాంఛైజీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ 1, అవతార్ 2 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని విజయం సాధించాయి. ఇప్పుడు డిసెంబర్ 19 శుక్రవారం రోజు అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ రిలీజ్ కాబోతోంది. దీనితో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇండియాలో కూడా అవతార్ 3 పై క్రేజ్ ఉండడంతో 20th సెంచరీ స్టూడియోస్ సంస్థ రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మధ్య వీడియో కాన్ఫెరెన్స్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు టాప్ డైరెక్టర్ ఆసక్తికర విషయాలు చర్చించుకున్నారు. రాజమౌళి అవతార్ విశేషాలని కామెరూన్ ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కామెరూన్ వారణాసి సినిమా గురించి రాజమౌళి అడిగి మరీ తెలుసుకోవడం విశేషం.
వారణాసి సెట్‌కి కామెరూన్ వస్తారా?
కామెరూన్ మాట్లాడుతూ.. ఫిలిం మేకర్స్ క్రియేటివ్ ప్రాసెస్ గురించి చర్చించుకోవడం చాలా అవసరం. నేను ఏదో ఒక టైంలో నీ సినిమా సెట్ కి రావాలని అనుకుంటున్నాను. నేను నీ మూవీ షూటింగ్ కి రావచ్చా అని కామెరూన్ అడిగారు. వెంటనే రాజమౌళి స్పందిస్తూ అంతకి మించిన గౌరవం ఇంకొకటి లేదు. మీ కోసం నా సినిమా యూనిట్ మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తుంది.. మీరు వస్తే ఘనస్వాగతం లభిస్తుంది అని అన్నారు.
నువ్వు తీస్తున్న వారణాసి సినిమా సంగతి ఏంటి అని కామెరూన్ అడిగారు. రాజమౌళి సమాధానం ఇస్తూ.. అవును సార్, ఏడాదిగా షూట్ చేస్తున్నాం. ఇంకో 8 నెలల షూటింగ్ మిగిలి ఉంది అని తెలిపారు. వారణాసి షూటింగ్ లో ఏదైనా ఫన్ ఉంటే చెప్పు, టైగర్స్ తో సీన్లు ఉంటే చెప్పు నేను కూడా వస్తాను అని సరదాగా అన్నారు. రాజమౌళి నవ్వేశారు.
అవతార్ 3, వారణాసి ప్రమోషన్స్
ఆ తర్వాత రాజమౌళి కామెరూన్ ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అవతార్ లో అంతటి క్లిష్టమైన పాత్రలు ఎలా క్రియేట్ చేశారు అని అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ఇండియాలో రిలీజ్ అవుతున్న అవతార్ 3 ప్రమోషన్స్ కి.. వారణాసి చిత్రాన్నిగ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాలని చూస్తున్న రాజమౌళి కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు.
ఈ ఇంటర్వ్యూ అవతార్ 3కి, అలాగే రాజమౌళి వారణాసి చిత్రానికి గ్లోబల్ స్థాయిలో ప్రచారం కల్పించింది. ఇద్దరు దిగ్గజ దర్శకుల మధ్య ఈ సంభాషణ సినీ ప్రపంచానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది.


