
📌 Key Points
- విజయ్ చివరి సినిమాగా ‘జన నాయగన్’, అభిమానుల్లో తీవ్ర భావోద్వేగం!
- సెన్సార్ బోర్డు నుండి 32 అభ్యంతరాలు, విడుదలపై నీలినీడలు!
- కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్!
- అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు!
తమిళ స్టార్ విజయ్ తలపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలపడంతో విడుదల వాయిదా పడింది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సెన్సార్ అభ్యంతరాలు: సినిమా భవితవ్యం?
Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా విడుదల అనేది విజయ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ గా మారింది. దానికి కారణం జన నాయగన్ విజయ్ కి చివరి సినిమా కావడమే.
అయితే, ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా జనవరి 9న విడుదల కావాలి. కానీ, జన నాయగన్(Jana Nayagan) సినిమాపై సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. దాదాపు 32 సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. దీంతో, విడుదలకు ఒకరోజు ముందు జన నాయగన్ మూవీ వాయిదా పడింది. సెన్సార్ అభ్యంతరాలకు ఒప్పుకొని మూవీ టీం కోర్టుకు వెళ్లారు. తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరారు.
కోర్టు తీర్పు: అభిమానుల ఆశలు?
ఈ పిటీషన్ పై ఇవాళ ఉందయం 10:30కి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. అయితే, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఇన్ని అభ్యంతరాల మధ్య జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. కానీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎదురుచూపులు ఆపడం లేదు. ఇప్పటికే, సినిమాను ఫస్ట్ డే చూడాలని చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు.
విడుదలపై ఉత్కంఠ: విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!
వారికి రిఫండ్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. కేవలం, ఈ అడ్వాన్స్ సేల్స్ తోనే ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. మరి ఇవాళ కోర్టు ఏ తీర్పు ఇస్తుందా అనేది చూడాలి.
జన నాయగన్ సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు తీర్పు కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


