|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Janaki vs State of Kerala: సెన్సార్ బోర్డ్ దృష్ణికోణాన్ని మార్చుకోవాలి.. మేము మాత్రం మార్పు చెయ్యము.. డైరెక్టర్ సంచలన కామెంట్స్

Published: 03-07-2025, 9:53 AM
Janaki vs State of Kerala: సెన్సార్ బోర్డ్ దృష్ణికోణాన్ని మార్చుకోవాలి.. మేము మాత్రం మార్పు చెయ్యము.. డైరెక్టర్ సంచలన కామెంట్స్

అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ‘జానకి’ పేరుపై విమర్శలు వస్తున్నాయి.

Key Points

1

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది.

2

‘జానకి’ అనే పేరుపై విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ నిలిపివేసింది.

4

సినిమా పేరు మార్చడం చివరి దశలో కష్టమని దర్శకుడు తెలిపారు.

జానకి సినిమా సెన్సార్ సమస్య

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala). ప్రవీణ్ నారాయణ్ (Praveen Narayan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయకపోవడంతో ఆగిపోయింది. అనుపమ పరమేశ్వరన పోషిస్తున్న బాధితురాలి పాత్రకు ‘జానకి’ అనే పేరు పెట్టడంపై విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డ్ (Sensor board) సర్టిఫికేట్ జారీ చేయకపోవడంతో పాటు.. టైటిల్‌లోని పేరును, ఆ పాత్ర పేరును మార్చాలని లేకుంటే సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.

తాజాగా దీనిపై డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ స్పందిస్తూ.. ‘జానకి అంటే సీతాదేవికి ఉన్న మరో పేరు అని అందరికి తెలుసు. కానీ, ఈ పేరును ఎన్నో ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. పైగా మేము ఈ సినిమాలో సీతా దేవిని ఎక్కడా కించపరచలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతిసే విధంగా ఇందులో సన్నివేశాలు కూడా లేవు. బహుశా సెన్సార్ బోర్డు దీన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మేము ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. చివరి దశలో పేరు మార్చడం కష్టం’ అని తెలిపాడు దర్శకుడు.

సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై దర్శకుడి స్పందన

సినిమా పేరు మార్చే అవకాశం లేదు

చివరి నిమిషంలో సినిమా పేరు మార్చడం కష్టమని దర్శకుడు స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు దృష్టికోణంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.