
📌 Key Points
- విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- సెన్సార్ పూర్తి చేసుకుని, పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ తో ‘A’ సర్టిఫికెట్ పొందింది.
- తొలుత జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా, పలు వివాదాలతో వాయిదా పడింది.
- లీకుల బెడదను ఎదుర్కొని, అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ వస్తున్న జననాయగన్.
కోలీవుడ్ దళపతి విజయ్ అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది! ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘జననాయగన్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ వార్త సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విజయ్ ఫ్యాన్స్‌కు పండుగే!
లీకులు, సెన్సార్ వివాదాలు… అడ్డంకులన్నీ తొలగిపోయాయి!
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, చిత్ర నిర్మాతలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు, సమస్యల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాకుండా, ఈ మధ్య కాలంలో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చిత్రబృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
దీంతో వెంటనే అలర్ట్ అయిన మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడుతుండటంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘జననాయగన్’కు సంబంధింది సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అన్ని అడ్డంకులను దాటుకుని ‘జననాయగన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సినిమాను జులై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా, ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని సమాచారం. సినిమాలో ఉన్న పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న తమ ప్రియతమ నటుడి చివరి సినిమా థియేటర్లలోకి రాబోతుందనే వార్త తెలియడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు.
జననాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్: భారీ అంచనాలతో వస్తున్న విజయ్!
పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ‘A’ సర్టిఫికెట్: ఫ్యాన్స్ కు కిక్!
జననాయగన్ రాకతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. విజయ్ స్టామినా మరోసారి ప్రూవ్ అవుతుంది. మరిన్ని బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!


