|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు! జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్ వైరల్!

Published: 03-03-2026, 12:05 PM
షాకింగ్: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు! జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్ వైరల్!
  • జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు అంటూ కామెంట్స్!
  • అర్జున్ కపూర్ పై ట్రోలింగ్ పై సీరియస్ కామెంట్స్ చేసిన జాన్వీ – వేధింపులకు సాకులు లేవంటూ ఫైర్!
  • సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద జరుగుతున్న ట్రోలింగ్స్ పై జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం.
  • నెగెటివిటీని పట్టించుకోవడం మానేశానని తెలిపిన జాన్వీ కపూర్ – ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు అర్జున్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న వేధింపులపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ట్రోలింగ్స్‌పై జాన్వీ కపూర్ ఫైర్!

Janhvi Kapoor About Trolling On Her And Arjun Kapoor: సోషల్ మీడియాలో తనపై, అన్న అర్జున్ కపూర్‌పై వచ్చే నెగెటివిటీపై జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. వ్యూస్ కోసం తమను బలిపశువులను చేస్తున్నారని, నెగెటివిటీని పట్టించుకోవడం మానేశానని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వచ్చే ట్రోలింగ్, విమర్శలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. దీనిపై బాలీవుడ్ బ్యూటీ, పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా మనసు విప్పారు.

అర్జున్ కపూర్ వేధింపులపై సీరియస్ కామెంట్స్!

ఇంటర్నెట్‌లో వ్యక్తం అయ్యే అభిప్రాయాలను తాను పెద్దగా పట్టించుకోనని, అయితే తన సోదరుడు అర్జున్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ సాగుతున్న వేధింపులకు మాత్రం ఎలాంటి సాకులు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘గ్రేజియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వేధింపుల వెనుక ఉన్న అసలు కోణాన్ని జాన్వీ కపూర్ విశ్లేషించారు.

నెగెటివిటీని పట్టించుకోను అంటున్న జాన్వీ!

“వ్యూస్ పెంచుకోవడానికి (Clickbait), ప్రజల్లో ఆగ్రహం కలిగించి చర్చ జరిగేలా చేయడానికి (Rage bait) మా పేర్లను ఉపయోగిస్తున్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే.. వారు చెప్పే మాటలకు, మా నిజ జీవితానికి అసలు సంబంధమే ఉండదని అర్థమవుతుంది. ఆ నిజాన్ని గ్రహించాక, నేను దేన్నీ మనసుకి తీసుకోవడం మానేశాను” అని జాన్వీ కపూర్ వివరించారు.

జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మరిన్నిupdates కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.