|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మలయాళీగా జాన్వీ కపూర్.. తప్పుబట్టిన సింగర్.. సగం తమిళియన్, సగం మలయాళీ అంటూ దేవర బ్యూటీ కామెంట్స్

Published: 24-08-2025, 2:13 AM
మలయాళీగా జాన్వీ కపూర్.. తప్పుబట్టిన సింగర్.. సగం తమిళియన్, సగం మలయాళీ అంటూ దేవర బ్యూటీ కామెంట్స్

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ సినిమాలో మలయాళీ అమ్మాయిగా నటించింది. ఆమె నటనపై మలయాళ నటీనటులు, ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జాన్వీ తన పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ, సగం తమిళియన్, సగం మలయాళీ అని పేర్కొంది.

Key Points

1

జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ సినిమాలో మలయాళీ అమ్మాయిగా నటించడంపై విమర్శలు.

2

మలయాళ నటి, గాయని పవిత్ర మీనన్ తోపాటు ఇతరులు జాన్వీ నటనను తప్పుబట్టారు.

4

జాన్వీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

పరమ్ సుందరి సినిమాపై విమర్శలు

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తెలుగులో దేవర సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్‌లో పరమ్ సుందరి అనే సినిమా చేస్తోంది. అయితే, ఇటీవల పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పరమ్ సుందరి సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్ర ఉంది. ఇదే మలయాళీను ఎక్కువగా అభ్యంతరానికి గురి చేసిన విషయం. పరమ్ సుందరి సినిమా, అందులో జాన్వీ కపూర్ యాసపై మలయాళీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పలువురు నటీనటులు ఓపెన్‌గా జాన్వీ కపూర్‌ను తప్బుబట్టారు.

నార్త్‌కు చెందిన జాన్వీ కపూర్‌ను పరమ్ సుందరి సినిమాలో మళయాల యువతిగా చూపించడాన్ని మలయాళ నటి, గాయని పవిత్ర మీనన్‌తోపాటు కంటెంట్ క్రియేటర్ స్టెఫీ తప్పుబట్టారు. కేరళ చిత్రసీమలో హీరోయిన్లు, నటీమణులు లేరా.. బాలీవుడ్ హీరోయిన్‌ను బలవంతంగా మలయాళీగా చూపిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

జాన్వీ కపూర్ వివరణ

ఈ నేపథ్యంలో మరోవైపు పరమ్ సుందరి మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది జాన్వీ కపూర్. ఈటీ డిజిటల్‌తో జరిగిన చర్చలో తన పాత్ర నేపథ్యంపై క్లారిటీ ఇచ్చింది జాన్వీ కపూర్. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, నిర్మాత దినేష్ విజన్ పాల్గొన్న ఈ ఇంటరాక్షన్‌లో తన పాత్రపై జాన్వీ కపూర్‌ను హోస్ట్ అడిగారు.

“ఓ నటిగా, రొమాంటిక్ కామెడీ సినిమాలంటే పడి చచ్చిపోయే ప్రేక్షకురాలిగా కంటే అసలు నేను ఏంటీ అనే పాయింట్ వద్ద ఉన్నాను నేను. మీరు చూస్తున్నంతసేపు చిరునవ్వు చిందించే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ పరమ్ సుందరి. నా మూలాలను తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చిన కథ ఇది” అని జాన్వీ కపూర్ తెలిపింది.

“నిజమే, నేను మలయాళినీ కాదు. మా అమ్మ కూడా కాదు. కానీ, నా పాత్ర మాత్రం సగం తమిళియన్, సగం మలయాళీ. నేను ఎప్పుడు మలయాళీల సంస్కృతి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. మలయాళ సినిమాకు నేను వీరాభిమానిని” అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

వైరల్ అవుతున్న కామెంట్స్

“ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందనుకుంటున్నా, ఇంట్రెస్టింగ్ స్టోరీ, అలాగే, నేను ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నా” అని జాన్వీ కపూర్ పేర్కొంది. ఇప్పుడు జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే, పరమ్ సుందరి సినిమా రెండు వేరు వేరు కల్చర్స్ ఉన్న హీరో హీరోయిన్ ప్రేమ, రొమాన్స్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఢిల్లీకి చెందినవాడు కాగా హీరోయిన్ కేరళకు చెందినది అని పరమ్ సుందరి ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఇకపోతే తుషార్ జలోటా దర్శకత్వం వహించిన పరమ్ సుందరి సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా , హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 29న థియేటర్లలో పరమ్ సుందరి రిలీజ్ కానుంది.

చివరగా, జాన్వీ కపూర్ వివరణతో విమర్శలు ఎంతవరకు తగ్గుతాయో చూడాలి. పరమ్ సుందరి సినిమా విజయంపై ఇది ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.