|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్నో పోరాటాలు చేశాను!

Published: 25-10-2025, 7:51 PM
ఎన్నో పోరాటాలు చేశాను!

సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలను బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పంచుకున్నారు. ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ షోలో ఆమె పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన అభిప్రాయాలను చెప్పడానికి చాలా పోరాటాలు చేశానని వెల్లడించారు. ట్వింకిల్ ఖన్నా ఆమె మాటలను సమర్థించారు.

Key Points

1

జాన్వీ కపూర్ ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ టాక్ షోలో తన అనుభవాలను పంచుకున్నారు.

2

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, సినీ పరిశ్రమలో పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడి.

4

ట్వింకిల్‌ ఖన్నా జాన్వీ మాటలను సమర్థిస్తూ, 1990లలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపారు.

జాన్వీ కపూర్‌ షాకింగ్ వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో  పోరాటాలు చేశానని జాన్వీ కపూర్‌ వెల్లడించారు. ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ టాక్‌ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచి్చనప్పటికీ ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో  పోరాటాలు చేశాను.

సినీ పరిశ్రమలో పురుషాహంకారం

నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్‌గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ట్వింకిల్ ఖన్నా మద్దతు

కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచి్చంది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్‌. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్‌ ఖన్నా కూడా జాన్వీ కపూర్‌ మాటలను స పోర్ట్‌ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్‌ చేశానని చె ప్పారు.

జాన్వీ కపూర్‌ వెల్లడించిన ఈ అంశాలు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. సెలబ్రిటీల అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. ఈ చర్చ భవిష్యత్తులో మంచి మార్పులకు దారితీస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.